leopard : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో తెలిసిపోతుంది. నిత్యం వేలాది వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి. మరికొన్ని వీడియోలు భయానకంగా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇక క్రూరమైన జంతువులలో ఒకటైన చిరుత పులి అంటే ప్రతి ఒక్కరికి భయం. అలాంటి చిరుతపులిని వ్యక్తులు ఏమాత్రం భయం లేకుండా దాంతో పాటు నడుస్తూ ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.
వీడియోలు చూపిస్తున్న చిరుత పులి పక్కన డజన్ మంది వ్యక్తులు ఉన్నారు. ఒకరు దానితో సెల్ఫీలు దిగుతున్నారు. ఇంకొకరు దాని వీపును తడుముతున్నారు. అయితే చిరుత పులి మద్యం సేవించిందని అందుకే తాను చిరుత పులిని అని మరిచిపోయిందని సోషల్ మీడియా వినియోగదారుడు తన ఖాతాలో వెలువడించాడు. మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో కాళీ సింధ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చూశారు. దీనిపై వారు అటవీ శాఖకు సమాచారం అందించారు. కర్రలతో, ఆయుధాలతో జంతువు వద్దకు వెళ్లారు. అయితే చిరుత పులి అస్వస్థతకు గురి కావడంతో ఎలాంటి దూకుడు కనిపించలేదు. దీంతో గ్రామస్తులు దానితో ఆడుకోవడం ప్రారంభించారు. దాని పక్కనే నడుస్తూ దాంతో ఫోటోలు దిగటం ప్రారంభించారు. అనంతరం అటవీ శాఖ సంఘటన స్థలానికి చేరుకొని చిరుత పులిని రక్షించారు.
తర్వాత చిరుతపులిని జంతువు ప్రదర్శనశాలకు తీసుకువచ్చారు. పరీక్షించిన తర్వాత పశు వైద్యులు దానికి జ్వరం మరియు ఫిట్స్ వచ్చినట్లు గుర్తించారు. అది నాడీ సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నట్లు, అది దాని జ్ఞాపక శక్తిని ప్రభావితం చేసినట్లు నివేదించారు. కాబట్టి అది మద్యం సేవించిన చిరుత పులి కాదని స్పష్టం చేశారు. కానీ సోషల్ మీడియాలో ఒక వ్యక్తి వీడియోను షేర్ చేస్తూ మద్యం తాగిన చిరుత పులి అని, తాగిన చిరుత పులి తానేంటో మరిచిపోయిందని ఫన్నీగా పోస్ట్ చేశారు. దీంతో నిజంగానే చిరుత పులి మద్యం సేవించింది అనుకున్నారు. కానీ వైద్యులు పరీక్షించిన తర్వాత దానికి నాడీ సంబంధిత వ్యాధి ఉందని తేలింది. అందుకే దానిలో దూకుడు కనిపించలేదు అలాగే అది తాగినట్లు కూడా స్పష్టం కాలేదు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.