Viral Video : కొత్త‌జంట మాస్ డ్యాన్స్ మాములుగా లేదుగా.. వీడియో వైర‌ల్

Authored By mallesh | The Telugu News | Published on: May 6, 2022, 2:00 pm

Viral Video : పెళ్లంటే మాములుగా సంద‌డి ఉండ‌దు. బంధువులు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా క‌లిసి చేసే సంద‌డి అంతా ఇంత కాదు. ప్ర‌స్తుతం పెళ్లిలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేస్తూ అద‌ర‌గొడుతున్నారు. ఎక్క‌డ చూసినా ఇదే ట్రెండ్ కొన‌సాగుతోంది. పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తేనే ఆ పెళ్లిలో కిక్ ఉంటుంది. పెళ్లి కూతురు సిగ్గుప‌డుతూ త‌ల‌దించుకునే రోజులు పోయాయి. ఏకంగా పెళ్లి మండ‌పానికి వ‌స్తూనే డ్యాన్స్ చేస్తూ రావ‌డం ట్రెండింగ్ లో ఉంది. ఇలా వంద‌ల వీడియోలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ఏ పెళ్లిలో చూసినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు.. మాస్ డ్యాన్స్ తో ఇర‌గ‌దీస్తున్నారు. పెళ్ల‌న‌గానే అంద‌రూ డ్యాన్స్ చేయ‌డానికి ప్రిపేర్ అయిపోతున్నారు. ఇంటిల్లిపాది డ్యాన్స్ చేసి అద‌ర‌గొడుతున్నారు.ఏదైనా సాంగ్ ట్రెండింగ్ లో ఉందంటే చాలు ఇక ఆ టైంలో జ‌రిగే పెళ్లిల్లో ఆ సాంగ్ మార్మోగుతుంది. ఇక నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌పా.. డుగ్గు డుగ్గు డుగ్గు అని.. ఈ పాట ఒక ఊపు ఊపేసింది. ఏ పెళ్లిలో చూసిని పెళ్లి కూతురు ఈ సాంగ్ కి స్టెప్పులేస్తూ తెగ వైర‌ల్ అయ్యారు. ఈ మాస్ డ్యాన్స్ కి పెళ్లి కొడుకు ఫిదా అయిపోతుంటాడు.

new couple mass dance video viral

new couple mass dance video viral

అలాగే డీజే ఫోక్ సాంగ్స్ తో చేసే సంద‌డి అంతా ఇంత కాదు. మాస్ డ్యాన్స్ చేస్తూ అంద‌రిచేత ఈల‌లు.. చ‌ప్ప‌ట్లు కొట్టించుకుంటారు. ఈ డ్యాన్స్ ను వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి.ప్ర‌స్తుతం ఇలాంటి వీడియో ఒక‌టి ఇన్ స్టాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. పెళ్లి స్టేజిపై వ‌ధూవ‌రులు డ్యాన్స్ చేస్తూ ఫొటోల‌కు ఫోజులిస్తున్నారు. డీజే టిల్లు మూవీ టైటిల్ సాంగ్ తో మాస్ డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp