Home » News » Parota Made With Neem Tree Leaves Video Going Viral On Social Media
News

Neem Tree Leaves : వేపాకులతో చేసిన పరోట … సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: July 8, 2024, 12:00 pm
Advertisement

Neem Tree Leaves : కరోనా మహమ్మారి వచ్చి పోయిన తర్వాత చాలా మంది ఆహారంతో వింత వింత ప్రయోగాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు. తనదైన రీతిలో ప్రయోగాలు చేస్తూ ఒక రేంజ్ లో హల్ఛ ల్ చేస్తున్నారు. అయితే ఆహారంతో ప్రయోగాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చేక్కర్లు కొడుతున్నాయి. కొన్ని వీడియోలలో ఆహార పదార్థాలు ఎంతో రుచికరంగా ఉండి ఆకర్షిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం ఇది అసలు తినటానికే చేస్తున్నారా అని అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా చాలా మంది వంటలు చేస్తూ వేరే స్థాయిలలో ప్రయోగాలు చేయటం మొదలుపెట్టారు. ఇంకా చెప్పాలి అంటే. వంటలతో వింతలు చేయడం మొదలుపెట్టారు.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం…

Advertisement

ఒక వ్యక్తి వేపాకులతో పరోటాలను తయారు చేశాడు. వేపాకులు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనకి తెలుసు. ఆయుర్వేదంలో వేపాకులు ఎంతో ముఖ్యమైనవిగా చెబుతారు. దాని రుచి చేదుగా ఉన్న, వేప లో ఆరోగ్యాన్ని మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం చూస్తే, వేప పిండిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే సగం రోగాలను దూరం చేయొచ్చు. అయితే మీరు ఎప్పుడైనా వేపాకులతో చేసిన పరోటాలను తిన్నారా. ప్రస్తుతం ఒక వ్యక్తి వేపాకులతో పరోటాలను ఎంతో సంతోషంగా తయారు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది…

రోడ్డు పక్కన నిల్చున్న వ్యక్తి వేప పరోటాలు తయారీ చేస్తున్నాడు.అయితే దీని కోసం ఆ వ్యక్తి ముందుగా వేప కొమ్మ నుండి కొన్ని తాజా వేపాకులను తీసుకున్నాడు. అతను ఆ ఆకులను క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాడు. ఆ తర్వాత అతను ఆ వేపాకుల మొక్కలను తీసుకొని ఉల్లిపాయ మరియు పన్నీరు మరియు మసాలా పొడులు మొదలైన వాటిలలో కలిపాడు. ఆ తర్వాత వాటన్నిటిని కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేశాడు. దాని తర్వాత చపాతి పిండి తీసుకొని రొట్టెలా చేసుకొని దానిలో ఈ మిశ్రమ పేస్ట్ ను పెట్టి పరోటాలు తయారు చేశారు.

Advertisement

Neem Tree Leaves : వేపాకులతో చేసిన పరోట … సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో…!

తర్వాత పెనం ను వేడి చేసి వెన్న వేసి పరోటాను కాల్చాడు. ఈ వీడియో అనేది ఇంస్టాగ్రామ్ లో AGRA Eatery శాఖాహార ఆహారం అనే ఖాతాలో షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో వేలాది వ్యూస్ మరియు ఎన్నో రకాల కామెంట్స్ సొంతం చేసుకుంది. ఈ వీడియో ను చూసిన తర్వాత నా నోరు చేదుగా అయింది అని ఒకరు కామెంట్ చేస్తే.మరొకరు మాత్రం డయాబెటి పేషెంట్లకు ఈ పరోటాలు తినిపించాలి అని కామెంట్ చేస్తున్నారు. అంతేకాక ఎంతోమంది వివిధ ఖాతాదారులు ఎన్నో రకాలుగా ఈ వీడియో పై తమ అభిప్రాయాలను తెలిపారు…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి