Ramanuj Gupta College Video Viral on youtube
Viral Video : చదువుల తల్లి సరస్వతి కొలువుదీరి ఉండే తరగతి గదిలో విద్యార్థులు అరాచకానికి పాల్పడ్డారు. తాము వచ్చింది చదువు కోవడానికి అని మరిచి తమ వయస్సుకు మించి ప్రవర్తించారు.అమ్మాయిలను అబ్బాయిలు కౌలిగించుకున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయం కళాశాల యాజమాన్యానికి తెలియడంతో వారిని సస్పెండ్ చేసినట్టు మేనెజ్మెంట్ ప్రకటించింది.అస్సాం రాష్ట్రం సిల్చార్‌లోని రామానుజ్ గుప్తా కాలేజీలోని విద్యార్థులు గాఢీ తప్పారు. కాలేజీ అని మరిచి అమ్మాయిలతో అబ్బాయిలు అనుచితంగా ప్రవర్తించారు.
దీంతో ఏడుగురిని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.వీరంతా 11వ తరగతికి చెందిన వారు. వీరిలో ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయిలను క్లాస్‌రూమ్‌లో ఒకరినొకరు కౌగిలించుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. అదే తరగతికి చెందిన తోటి విద్యార్థులు దీనంతటినీ రికార్డు చేసి నెట్టింట్లో అప్లోడ్ చేశారు.ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు విద్యార్థుల తీరు పై విమర్శలు గుప్పిస్తున్నారు.కొంతమంది కాలేజీ యాజమాన్యాన్ని కూడా తప్పుపట్టారు.ఈ వీడియోలు బుధవారం కళాశాల అధికారులకు చేరడంతో ఏడుగురు విద్యార్థులను వెంటనే కళాశాలకు రాకుండా సస్పెండ్ చేసారు.
Ramanuj Gupta College Video Viral on youtube
ఏడుగురిలో ముగ్గురు అబ్బాయిలు ,నలుగురు అమ్మాయిలు ఉన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పూర్ణదీప్ చందా మాట్లాడుతూ.. అధ్యాపకులు లేని టైములో విద్యార్థులు టిఫిన్ చేసే ప్రదేశంలో ఇలా రొమాన్స్ చేసుకుంటున్న దృశ్యాలు మా వద్దకు వచ్చాయి.కళాశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. క్యాంపస్‌లో మొబైల్ ఫోన్లు కూడా తీసుకురానివ్వము.11వ తరగతికి చెందిన స్టూడెంట్స్ కొత్తగా వచ్చారు. వీరు కాలేజీకి రాబట్టి కేవలం 15 రోజులు మాత్రమే అవుతుంది.వారి పేరెంట్స్‌ను పిలిచి కౌన్సిలింగ్ కూడా నిర్వహించాము. అంతేకాకుండా విద్యార్థులను కాలేజీ నుంచి పూర్తిగా టీసీలు ఇచ్చి పంపించేందుకు యాజమాన్యం ఆలోచిస్తున్నది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.