Viral Video : తరగతి గదిలో విద్యార్థుల అరాచకం.. ఒకరినొకరు కౌగిలించుకుని..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : తరగతి గదిలో విద్యార్థుల అరాచకం.. ఒకరినొకరు కౌగిలించుకుని..!

 Authored By aruna | The Telugu News | Updated on :18 August 2022,2:00 pm

Viral Video : చదువుల తల్లి సరస్వతి కొలువుదీరి ఉండే తరగతి గదిలో విద్యార్థులు అరాచకానికి పాల్పడ్డారు. తాము వచ్చింది చదువు కోవడానికి అని మరిచి తమ వయస్సుకు మించి ప్రవర్తించారు.అమ్మాయిలను అబ్బాయిలు కౌలిగించుకున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయం కళాశాల యాజమాన్యానికి తెలియడంతో వారిని సస్పెండ్ చేసినట్టు మేనెజ్మెంట్ ప్రకటించింది.అస్సాం రాష్ట్రం సిల్చార్‌లోని రామానుజ్ గుప్తా కాలేజీలోని విద్యార్థులు గాఢీ తప్పారు. కాలేజీ అని మరిచి అమ్మాయిలతో అబ్బాయిలు అనుచితంగా ప్రవర్తించారు.

Viral Video : సీరియస్ యాక్షన్‌కు ఆదేశం..

దీంతో ఏడుగురిని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.వీరంతా 11వ తరగతికి చెందిన వారు. వీరిలో ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయిలను క్లాస్‌రూమ్‌లో ఒకరినొకరు కౌగిలించుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. అదే తరగతికి చెందిన తోటి విద్యార్థులు దీనంతటినీ రికార్డు చేసి నెట్టింట్లో అప్లోడ్ చేశారు.ఈ వీడియో వైరల్‌ అవడంతో నెటిజన్లు విద్యార్థుల తీరు పై విమర్శలు గుప్పిస్తున్నారు.కొంతమంది కాలేజీ యాజమాన్యాన్ని కూడా తప్పుపట్టారు.ఈ వీడియోలు బుధవారం కళాశాల అధికారులకు చేరడంతో ఏడుగురు విద్యార్థులను వెంటనే కళాశాలకు రాకుండా సస్పెండ్ చేసారు.

Ramanuj Gupta College Video Viral on youtube

Ramanuj Gupta College Video Viral on youtube

ఏడుగురిలో ముగ్గురు అబ్బాయిలు ,నలుగురు అమ్మాయిలు ఉన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పూర్ణదీప్ చందా మాట్లాడుతూ.. అధ్యాపకులు లేని టైములో విద్యార్థులు టిఫిన్ చేసే ప్రదేశంలో ఇలా రొమాన్స్ చేసుకుంటున్న దృశ్యాలు మా వద్దకు వచ్చాయి.కళాశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. క్యాంపస్‌లో మొబైల్ ఫోన్లు కూడా తీసుకురానివ్వము.11వ తరగతికి చెందిన స్టూడెంట్స్ కొత్తగా వచ్చారు. వీరు కాలేజీకి రాబట్టి కేవలం 15 రోజులు మాత్రమే అవుతుంది.వారి పేరెంట్స్‌ను పిలిచి కౌన్సిలింగ్ కూడా నిర్వహించాము. అంతేకాకుండా విద్యార్థులను కాలేజీ నుంచి పూర్తిగా టీసీలు ఇచ్చి పంపించేందుకు యాజమాన్యం ఆలోచిస్తున్నది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది