Viral Video : రిసెప్ష‌న్ స్టేజిపై పెళ్లి కూతురు సిగ్గుప‌డుతూ మాస్ డ్యాన్స్ చేస్తూ ర‌చ్చ వీడియో

Authored By mallesh | The Telugu News | Published on: April 22, 2022, 1:00 pm

Viral Video: పెళ్లిలో డ్యాన్స్ చేయ‌డం అంటే అంద‌రికీ మ‌హా స‌ర‌దా.. ఈ మ‌ధ్య ఎక్క‌డ చూసిన ఇదే ట్రెండ్ కొన‌సాగుతోంది. పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తే ఆ కిక్కే వేరు. కొన్ని జ్ఞాప‌కాల‌ను జీవితాంతం దాచుకోవ‌డానికి ఇప్ప‌టి వ‌ధూవ‌రులు ట్రై చేస్తున్నారు. మండ‌పాల్లో.. రిసెప్ష‌న్ స్టేజిపై డ్యాన్స్ చేస్తూ వీడియోలు ఫొటోలు తీయించుకుంటూ చూసి మురిసిపోతున్నారు. ఇలా క‌లిసి డ్యాన్స్ చేయ‌డం వ‌ల్ల కూడా ఇద్ద‌రిమ‌ధ్య మంచి కెమిస్ట్రీ.. వ‌ర్క్ ఔట్ అవుతుంది. అందుకేనేమో.. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబ‌ర్స్, చుట్టాలు కూడా డ్యాన్స్ చేయ‌మ‌ని ఎంక‌రేజ్ చేస్తారు.

కొత్త‌ జంట‌ల‌తో వారు కూడా ఆడిపాడ‌తారు. కొంత మంది సినిమా పాట‌ల‌కు డ్యాన్స్ చేస్తూ మండ‌పానికి రావ‌టం.. మ‌రికొంత మంది మండ‌పాల్లో పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేయ‌డానికి డ్యాన్స్ చేయ‌డం.. ఇద్ద‌రూ క‌ల‌సి డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటుంటారు. మ‌రికొంత మంది మాస్ డ్యాన్స్ చేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తుంటారు.ఈ జ‌న‌రేష‌న్ లో అమ్మాయికి వంట వ‌చ్చేలేదో తెలియ‌దు కానీ.. డ్యాన్స్ మాత్రం క‌చ్చితంగా వ‌స్తుంది. అంతా సోష‌ల్ మీడియా.. యూట్యూబ్ మ‌హిమ‌. ఎదైనా స్టేజి దొరికితే చాలు స్టెప్పులేసి డ్యాన్స్ ఇర‌గ‌దీస్తున్నారు. ఒక‌ప్పుడు బ‌రాత్ ల‌లో డ్యాన్స్ చేసేవారు. ఇప్ప‌డు ఏ చిన్నా ఫంక్ష‌న్ అయినా చిందులు త‌ప్ప‌నిస‌రి.

Reception bride dancing video Viral

Reception bride dancing video Viral

పెళ్లి కూతురు సిగ్గుప‌డుతూ మండ‌పంలో కూచునే రోజులు పోయాయి. ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేయాలా అని ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.ప్ర‌స్తుతం ఓ యువ జంట డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. రిసెప్ష‌న్ స్టేజీపై వ‌ధూవ‌రులిద్ద‌రూ ప‌లు సినిమా పాట‌ల‌కు డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకున్నారు. క‌ల‌ర్ ఫుల్ డ్రెస్సింగ్ లో అమ్మాయి అందం అభిన‌యంతో చాలా చ‌క్క‌గా వరుడితో క‌ల‌సి స్టెప్పులేసింది. ఈ వీడియో కి ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌చ్చిప‌డ్డాయి. వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి…..

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp