
Sreeleela : గుంటూరు కారం సినిమాకి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న శ్రీలీల .. తెగ ఊపేసింది బాబోయ్... వీడియో
Sreeleela : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ గుంటూరు కారం ‘ సినిమాపై రోజుకు రోజుకి మరింత హైప్ పెరుగుతూనే ఉంది. చాలా కాలం తర్వాత మహేష్ పక్కా మాస్ యాక్షన్ సినిమా చేస్తుండడంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి కూర్చుని మడత పెట్టి అంటూ మాస్ బీట్ తో మంచి ఊపున్న పాట డిసెంబర్ 30న విడుదలైంది. ఈ పాట ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఇక శ్రీలీల అయితే తన డాన్స్ తో అదరగొట్టేసింది. మహేష్ బాబుతో శ్రీ లీల డాన్స్ వేరే లెవెల్ లో ఉంది. ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకత్వం వహించారు. సాహితి చాగంటి , శ్రీకృష్ణ ఈ పాటను పాడారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.
కుర్చీని మడత పెట్టి పాటకు మహేష్ బాబు శ్రీ లీల ఊర మాస్ స్టెప్పులు వేశారు. ఇద్దరు ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తుంది. ఇక ఈ పాట కోసమే శ్రీలీల డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారుష అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో శ్రీ లీల తన డాన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక శ్రీలీల మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అని అందరికీ తెలుసు. ఇప్పటి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్గా వచ్చిన శ్రీ లీల మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. పెళ్లి సందడి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తెలుగు హీరోయిన్ గా ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. నటన కాదు డాన్స్ కూడా అద్భుతంగా చేస్తున్న శ్రీలీలకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఆ తర్వాత ఆదికేశవ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాలు చేసింది కానీ అవి డిజాస్టర్ అయ్యాయి ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమా భారీ ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా శ్రీ లీలకు మంచి హిట్ ని వస్తుందో లేదో చూడాలని ఇక సూపర్ స్టార్ సినిమా అంటే అది కచ్చితంగా హిట్ అవుతుంది మహేష్ బాబు సినిమాలు డిజాస్టర్ కావు యావరేజ్ హిట్టునైన సొంతం చేసుకుంటాయి కానీ ఫ్లాప్ కావు ఒకవేళ ఫ్లాపైన అందుకు తగ్గ కలెక్షన్స్ వస్తాయి.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.