Sri Reddy : షార్ట్‌లో శ్రీ రెడ్డి వర్కవుట్స్.. అమ్మడిని చూసి మతులు పోతున్నాయంటున్న నెటిజన్స్
Sri Reddy: శ్రీ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రత్యక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు చేసిన రచ్చకు అందరు ఊగిపోయారు. ఎన్నో వివాదాల్లో చిక్కుకుని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్ ఆమె సొంతం అయింది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే. అలాగే తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతుంటుంది. ఇటీవల గోదారి యాసకి నాటు అందాలను జతచేసి వంటలతో ఘుమ ఘుమలాడిస్తోంది శ్రీరెడ్డి.
పల్లెటూరి వంటకాలకి మంచి మసాలా దట్టిస్తూ శ్రీ రెడ్డి చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ఈ అమ్మడు తాజాగా వర్కవుట్స్ చేస్తూ తన అందాలు ఆరబోసింది. పొట్టి షార్ట్‌లో ఈ అమ్మడి అందాల రచ్చ మతులు పోగొడుతుంది. శ్రీ రెడ్డి మైండ్ బ్లోయింగ్ లుక్స్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం శ్రీ రెడ్డి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా,ఆఫర్లు లేక సతమతం అవుతోన్న సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి.
Sri Reddy: శ్రీ రెడ్డి అందాల ఆరబోత..
అప్పట్లో చాలా మంది పేర్లను బయట పెడుతూ ఆమె వదిలిన ఫొటోల వల్ల ఇండస్ట్రీలో ప్రకంపనలు రేగాయి. అలాగే, ఫిలిం ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధ నగ్న నిరసన చేపట్టింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానెళ్ల డిబెట్లు, ఇంటర్వ్యూల్లో శ్రీరెడ్డి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తన గురించి తన సమస్యల గురించి వివరించే క్రమంలో ఎంతో మందిపై ఆరోపణలు చేసిందామె. ప్రస్తుతం అందాలు ఆరబోస్తూ యువతకి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది.