Viral Video : పెంపుడు జంతువులు అంటే అందరికీ చాలా ఇష్టం. వీటిలో చాలా మందికి ఇష్టమైన జంతువు కుక్క. కామన్‌గా ఇది అందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీని వల్ల చాలా మంది స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతారు. ఇక చిన్న పిల్లలకు అయితే వీటిని మించిన ఫ్రెండ్ ఉండడు. వీటితోనే ఎక్కువ టైం గడుపుతుంటారు. వాటిని అన్నం తినిపించడం, స్నానం చేయించడం వంటివి చేస్తుంటారు. కొన్ని సార్లు కుక్కలు చేసే పనులు ఫన్నీగా అనిపిస్తాయి. మనం కొన్ని సార్లు మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ కుక్కలు మాత్రం తమ ప్రాణాలకు తెగించి ఎంతటి పనినైనా చేసి విశ్వాసాన్ని చూపుతాయి.
కొన్ని సార్లు మనం చేయలేని పనులను అవి చేస్తుంటాయి. ఇలాంటి పని చేసి తన విశ్వాసాన్ని నిరూపించుకుంది ఓ కుక్క.ఒక జింక పిల్ల వాగులో చిక్కుకుని పోయింది. దీనిని గమనించి ఓ కుక్క ఈదుకుంటూ దాని దగ్గరకు వెళ్లింది. జింక పిల్ల పరిస్థితిని గమనించింది. అది వాగు దాటలేని పరిస్థితిలో ఉందని గ్రహించి దానిని ఎలాగైనా ఒడ్డుకు చేర్చాలని భావించింది. అనంతరం జింక పిల్లను నోటిలో కరుచుకుని వాగులో ఈదుకుంటూ ఒడ్డుకు చేర్చింది.
ఇలా కుక్క తన ప్రాణాలను లెక్కచేయకుండా జింక పిల్ల కోసం పెద్ద సాహసమే చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్స్ కుక్క చేసిన పనికి ఫిదా అవుతున్నారు. దానిని పొగడకుండా ఉండలేకపోతున్నారు. మనిషి ఆపదలో ఉన్నప్పుడు సాటి మనిషి సాయం చేయడానికి వెనకా ముందు అవుతుంటారు. కానీ కుక్క మాత్రం ఎలాంటి స్వార్థం లేకుండా తోటి మూగజీవిని కాపాడటానికి చేసిన రిస్క్‌ను చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. నిజమే కదా మరి.. మనుషులు సైతం ఇలా తోటి వారికి అన్ని వేళల్లో సహాయపడితే ఎంత బాగుంటుందో..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.