Viral Video : శ‌భాష్ శున‌క‌రాజా… త‌న ప్రాణాల‌కు తెగించి మ‌రి జింక పిల్లను కాపాడిన‌ కుక్క.. వైర‌ల్ వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : శ‌భాష్ శున‌క‌రాజా… త‌న ప్రాణాల‌కు తెగించి మ‌రి జింక పిల్లను కాపాడిన‌ కుక్క.. వైర‌ల్ వీడియో..!

 Authored By mallesh | The Telugu News | Updated on :19 January 2022,6:00 am

Viral Video : పెంపుడు జంతువులు అంటే అందరికీ చాలా ఇష్టం. వీటిలో చాలా మందికి ఇష్టమైన జంతువు కుక్క. కామన్‌గా ఇది అందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీని వల్ల చాలా మంది స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతారు. ఇక చిన్న పిల్లలకు అయితే వీటిని మించిన ఫ్రెండ్ ఉండడు. వీటితోనే ఎక్కువ టైం గడుపుతుంటారు. వాటిని అన్నం తినిపించడం, స్నానం చేయించడం వంటివి చేస్తుంటారు. కొన్ని సార్లు కుక్కలు చేసే పనులు ఫన్నీగా అనిపిస్తాయి. మనం కొన్ని సార్లు మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ కుక్కలు మాత్రం తమ ప్రాణాలకు తెగించి ఎంతటి పనినైనా చేసి విశ్వాసాన్ని చూపుతాయి.

కొన్ని సార్లు మనం చేయలేని పనులను అవి చేస్తుంటాయి. ఇలాంటి పని చేసి తన విశ్వాసాన్ని నిరూపించుకుంది ఓ కుక్క.ఒక జింక పిల్ల వాగులో చిక్కుకుని పోయింది. దీనిని గమనించి ఓ కుక్క ఈదుకుంటూ దాని దగ్గరకు వెళ్లింది. జింక పిల్ల పరిస్థితిని గమనించింది. అది వాగు దాటలేని పరిస్థితిలో ఉందని గ్రహించి దానిని ఎలాగైనా ఒడ్డుకు చేర్చాలని భావించింది. అనంతరం జింక పిల్లను నోటిలో కరుచుకుని వాగులో ఈదుకుంటూ ఒడ్డుకు చేర్చింది.

the dog that rescued the deer Viral video

the dog that rescued the deer Viral video

Viral Video : నోటిలో కరుచుకుని..

ఇలా కుక్క తన ప్రాణాలను లెక్కచేయకుండా జింక పిల్ల కోసం పెద్ద సాహసమే చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్స్ కుక్క చేసిన పనికి ఫిదా అవుతున్నారు. దానిని పొగడకుండా ఉండలేకపోతున్నారు. మనిషి ఆపదలో ఉన్నప్పుడు సాటి మనిషి సాయం చేయడానికి వెనకా ముందు అవుతుంటారు. కానీ కుక్క మాత్రం ఎలాంటి స్వార్థం లేకుండా తోటి మూగజీవిని కాపాడటానికి చేసిన రిస్క్‌ను చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. నిజమే కదా మరి.. మనుషులు సైతం ఇలా తోటి వారికి అన్ని వేళల్లో సహాయపడితే ఎంత బాగుంటుందో..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది