Viral video : తొండ‌మీద దాడి చేసిన పాము.. మ‌రో తొండ ఏం చేసిందో చూస్తే..

Authored By mallesh | The Telugu News | Updated on : 29 November 2021, 7:15 am

Viral video : వేట ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే. అది ఒక వైపు ఒక జీవి ప్రాణాన్ని తీసేస్తుంది. మ‌రోవైపు ఇంకో జీవి ప్రాణాన్ని నిల‌బెడుతుంది. అందుకే దీనికి అంత క్రేజ్ ఉంది. ఏ జంతువు అయినా స‌రే వేట‌లో ఆహారం కావ‌డం ఎన్నోసార్లు చూస్తున్నాం. ఇక అడ‌విలో అయితే ఇలాంటి వేట‌కు స‌మ‌యం, సంద‌ర్భం అంటూ ఏమీ ఉండ‌వు. ఎప్పుడు ఏ జంతువు ఎటు నుంచి వ‌చ్చి దాడిచేస్తుందో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కాదు. అయితే ఈ వేట కేవ‌లం అడ‌విలో మాత్ర‌మే కాదండోయ్ జీవి ఎక్క‌డ ఉంటే అక్క‌డ క‌చ్చితంగా సాగుతూనే ఉంటుంది. మానవ స‌మాజంలో బ‌తుకుతున్న వాటిల్లో కూడా ఇది ఉంటుంది.

మ‌న మ‌ధ్య ఉండే తొండ‌, పాము నుంచి మొద‌లు పెడితే స‌రీ సృపాల్లో ఈ వేట క‌చ్చితంగా ఉంటుంది. అయితే వేట‌కు సంబంధించిన వీడియోల‌కు సోష‌ల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక ఇప్పుడు కూడా వేట‌కు సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. దాన్ని చూస్తే నిజంగానే షాక్ అయిపోతారు. మ‌నం ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియోలో గ‌న‌క చూస్తే ఓ గోడ మీద రెండు తొండ‌లు ఆడుకుంటూ ఉన్నాయి. అయితే ఇంత‌లో అక్క‌డ‌కు ఎంట్రీ ఇచ్చిన పాము తొండపై దాడి చేసింది.

the snake that attacked the trunk

the snake that attacked the trunk

Viral video :  పాము మీద దాడి చేసిన మ‌రో తొండ‌

ఇక ఆ పాము ధాటి నుంచి త‌ప్పించుకునేందుకు తొండ ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తుంది. అయినా స‌రే ఆ పాము మాత్రం విడిచి పెట్ట‌కుండా ఉండ‌టంతో అక్క‌డే ఉన్న మ‌రో తొండ అలెర్ట్ అయిపోతుంది. వెంట‌నే పాము మీద అకస్మాత్తుగా దాడిచేస్తుంది. ఇంకేముంది ఆ దాడి నుంచి ఆ పాము తేరుకునేందుకు ప్ర‌య‌త్నించి వెంట‌నే అక్క‌డి నుంచి జారుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం మ‌నం చూడొచ్చు. కాగా ఈ పోరాటం మొత్తం గోడ మీదే జరుగ‌డం మ‌నం చూడొచ్చు. ఇదంతా కూడా అక్క‌డే ఉన్న కెమెరాల్లో రికార్డు కావ‌డంతో నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp