Girls fight in class : అసలు అమ్మాయిలా వీళ్లు.. క్లాస్ రూంలో జుట్లు పట్టుకుని ఇలా కొట్టేసుకుంటున్నారేంటి?
Girls fight in class : సోషల్ మీడియా మనిషికి ఒక డ్రగ్ అడిక్ట్‌లా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్, ఫన్నీ వీడియోస్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారని తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్‌లో నెట్ ఉంటే చాలు అసలు ఈరోజుల్లో టైమే తెలియడం లేదు. చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. ఇక సోషల్ మీడియాకు నేటితరం బానిసల్లా మారిపోతున్నారనడంలో ఏంమాత్రం అతిశయోక్తి లేదు.
Girls fight in class : క్రమశిక్షణ తప్పిన విద్యార్థినులు
ముఖ్యంగా చదువుకునే విద్యార్థినీవిద్యార్థులు సోషల్ మీడియా వినియోగం వలన వారికి క్రమశిక్షణ లేకుండా పోతోంది. కొందరు ప్రతి చిన్న విషయాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తరగతిలో ఎలా ఉండాలి. ఇంట్లో ఎలా ఉండాలనే విషయాలు కూడా నేటితరం స్టూడెంట్స్‌కు తెలియడం లేదని ఈ వీడియోను చూస్తే స్పష్టంగా అర్థం అవుతోంది.
మన విద్యా వ్యవస్థ అద్వానంగా ఉండటం కూడా పిల్లలపై సామాజిక దుష్పరిణామాల ప్రభావం ఎక్కువగా పడుతోందని ఇట్టే అర్థం అవుతోంది. తరగతిలోనే దేశ భవిష్యత్‌కు పునాదులు పడుతుంటాయని మహానుభావులు చెప్పిన విషయాన్ని విద్యావంతులే విస్మరిస్తున్నారు. విద్యార్థులపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వారు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. దీనంతటికీ సోషల్ మీడియా ప్రభావం వారిపై ఎంతో కొంత ఉంటుందని కూడా అంటున్నారు.
తాజాగా యూపీలోని కాన్పూర్‌లో ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన ఆడ పిల్లలు జుట్లు పట్టుకుని మరీ విపరీతంగా దెబ్బలాడుకున్నారు. తాము ఉన్నది తరగతి గది అని మర్చిపోయారు. జుట్లు లాక్కుంటూ వారు కొట్టుకుంటున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు కోట్టుకోవద్దని, ఆపాలని ఎంత చెబుతున్నా వినకుండా వారు చేసేది వారు చేశారు. ఈ ఉదంతాన్ని తరగతి గదిలోని మరో విద్యార్థిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. స్కూల్ టీచర్లు విద్యార్థులను పట్టించుకోకుండా గాలికి వదిలేయడం వల్లే ఇలా జరిగిందని.. అసలు తరగతి గదిలోకి ఫోన్లు ఎందుకు అనుమతి ఇచ్చారని కూడా కొందరు విమర్శిస్తున్నారు.
कानपुर में एक नामी निजी स्कूल की इन लड़कियों की ये पटकम-पटकाई का वीडियो खूब वायरल हो रहा है। हाईस्कूल की ये स्टूडेंट्स स्कूल ऑवर्स में ही एक दूसरे से भिड गईं।#Kanpur pic.twitter.com/BQGyza6Rqd
— Amit Singh (@amit3_singh) August 27, 2022