Viral Video : వామ్మో ఇది మామూలు తాబేలు కాదు.. పిల్లిని ఏం చేసిందో చూడండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : వామ్మో ఇది మామూలు తాబేలు కాదు.. పిల్లిని ఏం చేసిందో చూడండి

Viral Video : సాధారణంగా తాబేలు పేరు ఎత్తగానే.. హా.. అది ఏం చేస్తుందిలే సాధు జంతువు అని అనుకుంటాం. కానీ.. తాబేలుకు ఉన్న బలం, దాని విశిష్టత చాలామందికి తెలియదు. చిన్నప్పుడు మనం తాబేలు, కుందేలు స్టోరీ చదువుకున్నాం కదా. ఆ స్టోరీలో తాబేలు, కుందేలు పరుగుపందెం పెట్టుకుంటాయి. కానీ.. చివరకు మెల్లగా నడిచే తాబేలు పరుగుపందెంలో గెలుస్తుంది. అందుకే పెద్దలు కూడా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని మనకు చెబుతుంటారు. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 December 2021,2:20 pm

Viral Video : సాధారణంగా తాబేలు పేరు ఎత్తగానే.. హా.. అది ఏం చేస్తుందిలే సాధు జంతువు అని అనుకుంటాం. కానీ.. తాబేలుకు ఉన్న బలం, దాని విశిష్టత చాలామందికి తెలియదు. చిన్నప్పుడు మనం తాబేలు, కుందేలు స్టోరీ చదువుకున్నాం కదా. ఆ స్టోరీలో తాబేలు, కుందేలు పరుగుపందెం పెట్టుకుంటాయి. కానీ.. చివరకు మెల్లగా నడిచే తాబేలు పరుగుపందెంలో గెలుస్తుంది.

అందుకే పెద్దలు కూడా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని మనకు చెబుతుంటారు. తాబేల మెల్లగా నడిచినా.. అది చాలా బలమైన జీవి. దాని ఆయుష్షు కూడా గట్టిదే. తాబేలు కనీసం వెయ్యి ఏండ్లు బతుకుతుంది. అలాగే వాటికి ధైర్యం కూడా ఎక్కువే.

turtle and cat fight video viral

turtle and cat fight video viral

Viral Video : పిల్లిని ఈ తాబేలు ఎలా పరుగులు పెట్టించిందో చూడండి

ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ఓ తాబేలు, పిల్లి రెండింటి మధ్య ఫైట్ కు సంబంధించిన వీడియో అది. షార్ట్ వీడియో అయినప్పటికీ ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గోడ పక్కన కూర్చొని ఉన్న ఓ పిల్లిని తాబేలు చూస్తుంది. నెమ్మదిగా పిల్లి వైపు నడుచుకుంటూ వెళ్తుంది తాబేలు. ఆ.. ఇది నన్నేం చేస్తుందిలే అని అనుకొని ఉంటుంది పిల్లి. ఇంతలో తాబేలు.. పిల్లి మీద దూకేస్తుంది. దీంతో పిల్లికి భయం వేసి.. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుతుంది. వామ్మో.. తాబేలు చూస్తే ఎంత అమాయకంగా ఉంది.. పిల్లిని ఎలా పరుగులు పెట్టించింది అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది