Home » News » Viral Video A Women Slapped Traffic Police
News

Viral Video : ట్రాఫిక్ పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ .. వైరల్ వీడియో

Authored By
aruna
The Telugu News | Updated on: October 12, 2023 6:54 pm
Advertisement

Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియో పై నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తూ ఉంటారు. నిత్యం సోషల్ మీడియాలో వేలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ మహిళ ట్రాఫిక్ పోలీసును చెప్పుతో కొట్టింది. ఆమె అలా ఎందుకు కొట్టిందో అక్కడున్నవారికి ఏమీ అర్థం కాలేదు. కానీ ఓ వ్యక్తి వీడియో తీయడంతో అది కాస్త ఇలా వైరల్ గా మారింది.

Advertisement

ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తన వాహనాన్ని అడ్డుకున్నారన్న కారణంతో ఓ మహిళ ఏకంగా ట్రాఫిక్ పోలీసు ని చెప్పుతో కొట్టింది. ఘజియాబాద్ లో మిథిలేష్ అనే మహిళ ఈ రిక్షా డ్రైవర్ తన వాహనానికి నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుమీదికి వచ్చారు. దీంతో ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ ఆమెను ప్రశ్నించారు. వాహనాన్ని ముందుకెళ్లకుండా ట్రాఫిక్ పోలీస్ అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ పోలీసు తో వాగ్వాదానికి దిగింది. నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ దూషిస్తూ పోలీసును ఏకంగా చెప్పు తీసుకొని కొట్టింది.దీంతో పోలీసు కూడా ఆమెను కొట్టపోయారు. కానీ కాస్త వెనక్కి తగ్గిపోయారు నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపైకి వచ్చినది కాక ఆ మహిళ ఏకంగా పోలీసు పైనే చేయి చేసుకుంది.

Viral Video A women slapped traffic police

Advertisement

ఈ వీడియో పైన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తప్పు ఆమె వైపే ఉన్న అక్కడ జనాలంతా చూస్తూ ఉండిపోయారు. కానీ ఎవరు స్పందించలేదని నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. ఈ ఘటన మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందరూ చూస్తూ ఉండిపోయారు కానీ ఒక్కరైనా అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి