Viral Video : అరే ఎంత బాగా స్పిన్ చేస్తోందో..

Authored By mallesh | The Telugu News | Published on: April 4, 2022, 10:00 pm

Viral Video: పెంపుడు కుక్కలు ఎంత ప్రేమ, విశ్వాసం చూపుతాయొ.. అంతకు మించిన అల్లరి చేష్టలు చేస్తాయి. కొన్ని కుక్కలు బుద్ధిగా ఉంటే.. మరికొన్ని మాత్రం నానా రచ్చ చేస్తాయి. కొన్ని కుక్క‌లు య‌జ‌మానులు ఏది చేస్తే అది చేస్తాయి.. ఎలా చెబితే అలా వింటాయి. ఏవైనా వ‌స్తువులు తెమ్మ‌న‌గానే వెంట‌నే ప‌రుగెత్తుకెళ్లి తెచ్చిపెడ‌తాయి. కుక్కల వికృత చేష్టలు అప్పుడప్పుడు ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతూ.. నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. చాలామంది శునకాలను పెంచుకుంటుంటారు.

ఈ క్రమంలో మనుషులు చేసే కొన్ని పనులను శునకాలు కూడా అనుసరిస్తుంటాయి.జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా తేలిగ్గా వైరల్ అవుతుంటాయి. జంతువుల చిలిపి చేష్టలు నచ్చని వారు అస్సలుకే ఉండరు. సోషల్ మీడియాలో ఉన్న ఈ వీడియోలను చాలా మంది నెటిజన్లు చూస్తారు. అంతే కాకుండా ఆ వీడియోలను లైక్ చేయడంతో పాటుగా వాటి మీద కామెంట్లు కూడా పెడ‌తుంటారు. అందుకోసమే ఇటువంటి వీడియోలు ఎక్కువగా లైమ్ లైట్ లోకి వస్తుంటాయి.

Viral Video hey how well does it spin

Viral Video hey how well does it spin

ఇలాంటిదే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఓ పార్క్ లో ఉన్న కుక్క మూతిపై స్పిన్ప‌ర్ పెట్టుకుని తెగ తిప్పేస్తోంది. ఆ స్పిన్ప‌ర్ ఆగే వ‌ర‌కు పైకి మూతి పెట్టి అలాగే నిల్చుంది. చూసేవాళ్ల‌కి దీనికి ఇన్ని తెలివితేట‌లు ఎక్క‌డినుంచి వ‌చ్చాయ‌బ్బ అనిపిస్తుంది. ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. వావ్ యూ డోన్ ఇట్.. సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి ఈ వీడియో..

https://twitter.com/Laughs_4_All/status/1509349948252381184

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp