Home » Exclusive » Viral Video In Bride Stunning Dance Performance
Exclusive

Viral Video : అంద‌రి ముందు నాన్‌స్టాప్‌గా చిందులేసిన పెళ్లి కూతురు.. షాక్ అయిన వ‌రుడు వీడియో… !

Authored By
Sam C
The Telugu News | Published on: April 6, 2022, 8:00 pm
Advertisement

Viral Video : ఈరోజుల్లో పెళ్లిళ్లు ఎంత అట్ట‌హాసంగా జ‌రుగుతున్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం.ఒక‌ప్ప‌టి మాదిరిగా సాదాసీదాగా జ‌రిపించి ఊరుకోవ‌ట్లేదు. సంగీత్, మెహందీ వేడుక‌లు అంటూ తెగ ర‌చ్చ చేస్తున్నారు. ఈ వేడుక‌ల‌లో వ‌ధూ వ‌రులతో పాటు వ‌చ్చిన బంధువులు కూడా తెగ డ్యాన్స్ లు చేస్తూ సంద‌డి చేస్తున్నారు. ఆ మ‌ధ్య ఓ వధువు తన పెళ్లి త‌ర్వాత జ‌రిగిన‌ బరాత్‌లో ఆ పాట‌కు ల‌య బ‌ద్దంగా కాలు క‌దుపుతూ చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంది.. వ‌ధువు స్టెప్పుల‌కు.. ఫిదా అయిన భర్త అలా చూస్తుండి పోయాడు.. అయితే వ‌ధువు ఏదో ఒక్క స్టెప్పు వేసి ఊరుకోలేదు..

Advertisement

పాట పూర్తిగా అయిపోయేవ‌ర‌కు త‌న నృత్యంతో ఆక‌ట్టుకుంది.. అప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది..అప్ప‌టి నుండి ఆ సాంగ్‌కి చాలా మంది పెళ్లిళ్లలో డ్యాన్స్‌లు చేశారు. టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత కూడా బుల్లెట్ బండి సాంగ్‌కి పెళ్లిలో అదిరిపోయే స్టెప్పులేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ పెళ్లికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత.. బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేశారు. వధూవరులతో పాటు ఎంపీ కవిత కూడా డ్యాన్స్ చేశారు.

Viral Video in bride stunning dance performance

Advertisement

Viral Video : పెళ్లి కూతురు అద‌ర‌గొట్టింది..

ఇలా నిత్యం పెళ్లిళ్ల‌లో బంధువులు లేదంటే వ‌ధూ వరులు చేసిన డ్యాన్స్ వీడియోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి.ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎంతో యువతీ యువకులు ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. వారు కూడా హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా స్టెప్స్ తో అదరగొడుతున్నారు. ఇక అలా సోషల్ మీడియా లో ఒక యువతీ చేసిన డాన్స్ హల్చల్ చేస్తుంది. త‌న పెళ్లిలో బంధువ‌ల‌తో క‌లిసి నాన్‌స్టాప్ డ్యాన్స్ చేసింది. చివ‌ర‌కు పెళ్లి కొడుకు ఎంట్రీతో సాంగ్ ముగించింది. కాక‌పోతే పెళ్లి కుమార్తె దాదాపు ఎనిమిది నిమిషాల పాటు తెగ సంద‌డి చేసింది. ఆమె డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి