Viral Video : ఇదేం తెలివిరా నాయ‌నా.. నూడిల్స్ ఇలా కూడా తింటారా..?

Authored By mallesh | The Telugu News | Updated on : 10 March 2022, 8:30 pm

Viral Video : ఒక్కోసారీ కొన్ని ఫుడ్ ఐట‌మ్స్ ఎలా తినాలో అర్థం కాదు. ఎలాగోలా తిన‌డానికి ట్రై చేస్తాం.. కానీ అది కాస్తా ఫ‌న్ క్రియేట్ చేస్తుంది. దీంతో తినాలంటేనే భ‌య‌ప‌డ‌తారు కొంద‌రు. కొంద‌రు ధైర్యంగా తింటారు ఏంజ‌రిగినా ప‌ట్టించుకోకుండా త‌మ‌ప‌ని కానిచేస్తారు. మ‌రికొంద‌రు కిందామీదా ప‌డుతూ తింటారు. మ‌రికొంద‌రు తిన‌డ‌మే మానేస్తారు. కొంత మంది తిన‌డ‌మంటే యుద్ధంలా తినేస్తుంటారు. అయినా ఏదైనా తినాల‌నుకుంటే ఓ ప‌ద్ద‌తి ప్లానింగ్ అంటు ఏం ఉండ‌దు తినేయ‌డ‌మే అన‌ట్లు ఉంటుంది మ‌రికొంద‌రి తీరు.

ఇది మ‌నంద‌రికి ఎప్పుడో ఒక చోట ఇలాంటి సంఘ‌ట‌న ఎదుర‌య్యే ఉంట‌ది. కొంతమంది భోజనం నెమ్మదిగా చేస్తుంటారు. మరికొంతమంది ఫాస్ట్‌గా చేసేస్తుంటారు. అడిగితే టైమ్ లేదు.. అంత సమయం భోజనానికే కేటాయించలేం అని చెబుతుంటారు. కొంద‌రు ఫ్రెండ్స్ ముందు సిగ్గుప‌డుతూ తింటుంటారు ఈ లోగా టెన్ష‌న్‌లో ఏదో మిస్టేక్ చేసి ఫ‌న్ క్రియేట్ చేస్తారు. మ‌రికొంద‌రు అమ్మాయిల‌తో ఫుడ్‌కోర్టుకు వెళ్లి చాలా స్టైల్‌గా తిన‌డానికి ట్రై చేసి ప‌ప్పులో కాలేస్తారు.

viral video in eat noodles Men

viral video in eat noodles Men

Viral Video : కావాల‌నే న‌వ్వించ‌డానికి

కొంత‌మంది కావాల‌నే అంద‌రిని న‌వ్వించ‌డానికి చేస్తారు. ఎలా చేసినా మొత్తానికి ఫ‌న్ క్రియేట్ అవుతుంది.ఈ వీడియోలో ఒక అత‌ను ఫుడ్ తింటున్న విధానం చూస్తుంటే న‌వ్వొచేస్తుంది. నూడుల్స్ పొడ‌వుగా ఉండి తిన‌డానికి కంఫ‌ర్ట్ లేక‌పోవ‌డంతో ఇదంతా కాద‌ని ఓ క‌త్తెర‌తో క‌ట్ చేస్తూ తింటున్నాడు. ఇది కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో నేటిజ‌న్లు ట్రోల్ చేస్తూ ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp