Viral Video : ఇదేం విచిత్రం.. చేప‌ల‌కు ఆహారం తినిపిస్తున్న బాతులు.. వీడియో వైర‌ల్‌

Authored By mallesh | The Telugu News | Published on: March 12, 2022, 4:00 pm

Viral video : కొన్ని జంతువులు, ప‌క్షులు బ‌ద్ద శత్రువులుగా ఉంటాయి. ఎప్పుడూ పోట్లాడుతూ క‌నిపిస్తాయి. కొన్ని బ‌ద్ద విరోదులైనా చాలా చ‌క్క‌గా స్నేహం చేస్తాయి. ఒక్కోసారి కొన్ని ఒక‌దానికికొక‌టి సాయ‌ప‌డుతూ ఉంటాయి. ఓ కుక్క గుర్రం మీద స్వారీ చేస్తుంది. మరో చిన్న బాతు, పిల్లి వెంటే పరుగులు తీస్తుంటుంది. ఒక చిట్టెలుక, పాముతో కలిసిమెలిసి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో జోరుగా షేర్ అవుతున్న ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు కూడా చూసే ఉంటారు. కొన్ని జీవులు వేరే జాతి పిల్లల ఆలనా పాలనా చూస్తుంటాయి.

కోకిల పెట్టిన గుడ్లను కాకి పొదిగి, దాని పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది. ఇలా చాలా వ‌ర‌కు ప‌క్షుల్లో జంతువుల్లో స్నేహం చిగురిస్తుటుంది.వేటాడే జంతు జాతుల్లో కూడా ఇలాంటి సున్నిత ధోరణి వల్ల ఏదైనా ఒక పిల్లకు, దానిని పెంచే తల్లికి మధ్య మమతానురాగాలు ఏర్పడుతాయి. గాడిద, కుక్క మధ్య మంచి స్నేహం కుదురుతుంది. కలిసి జీవించడంలో ఉన్న ప్రయోజనాలు,

viral video is weird ducks feeding fish

viral video is weird ducks feeding fish

Viral video : ఇలా స్నేహం కుదురుతోంది..

అవి మిగతా జాతుల జంతువులంటే ఉన్న భయాన్ని కూడా అధిగమించేలా చేస్తాయి. ఇలా అవి తెలియ‌కుండానే స్నేహానికి అల‌వాటు ప‌డ‌తాయి.స్నేహానికి ఎటువంటి హద్దులు లేవని నిరూపించాయి ఈ బాతులు . ఆహారం కోసం అలమటిస్తున్న చేపలను చూసి స్వయంగా తమ‌ నోటితో అందిస్తూ.. అందరిని ఆశ్చర్యపరిచా యి. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌డంతో నెటిజ‌న్లు వావ్‌! అంటూ ట్రోల్ చేస్తున్నారు.

https://twitter.com/Yoda4ever/status/1501573536439230468

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp