Viral Video : తాబేలు మీద షికారు.. ఎంజాయ్ చేస్తున్న లెమర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : తాబేలు మీద షికారు.. ఎంజాయ్ చేస్తున్న లెమర్

Viral video : మనుషులు ఎంజాయ్ చేసినట్టుగానే జంతువులు సైతం తమ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని జంతువులైతే మరి ఎక్కువ బద్దకాన్ని చూపుతాయి. అవి చేసే పనులు కొన్ని సార్లు నవ్వు తెప్పించినా.. మరి కొన్ని సార్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొన్ని జంతువులు తమ పని తాము చేసుకుంటుంటే వేరే జంతువులు ఆ పనిని చెడగొడుతుంటాయి. మరి కొన్ని జంతువులు ఎదటి జంతువులపై ఆధారపడతాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు మనం ఇప్పటికే చాలా […]

 Authored By mallesh | The Telugu News | Updated on :8 March 2022,8:20 am

Viral video : మనుషులు ఎంజాయ్ చేసినట్టుగానే జంతువులు సైతం తమ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని జంతువులైతే మరి ఎక్కువ బద్దకాన్ని చూపుతాయి. అవి చేసే పనులు కొన్ని సార్లు నవ్వు తెప్పించినా.. మరి కొన్ని సార్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొన్ని జంతువులు తమ పని తాము చేసుకుంటుంటే వేరే జంతువులు ఆ పనిని చెడగొడుతుంటాయి. మరి కొన్ని జంతువులు ఎదటి జంతువులపై ఆధారపడతాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు మనం ఇప్పటికే చాలా చూశాం.

ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఫన్నీగా కామెంట్స్ సైతం చేస్తున్నారు.తాబేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి హడావుడి లేని జీవి. నెమ్మదిగా కదులుతూ తన పని తాను చేసుకుంటుంది. ఇలా ఒక తాబేలు ఇసుకలో నుంచి వెళ్తుండగా దానిపై ఒక లెమర్ కూర్చుండి. అటూ ఇటూ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది.

Viral Video lemur stroll on the turtle

Viral Video lemur stroll on the turtle

Viral video : తాబేలుపై కూర్చుని ఎంజాయ్ చేస్తూ..

పాపం తాబేలు మాత్రం దానిని మోసుకుంటూ ముందుకు పోతూనే ఉంది. దీంతో తాబేలు ఓపికను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక లెమర్‌ను మాత్రం భలే ఐడియా నీది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో లెమర్ ఎక్స్‌ప్రెషన్స్ భలేగా ఉన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది