Viral Video : మెగాస్టార్ పాట‌కి అదిరిపోయే డ్యాన్స్ చేస్తున్న బామ్మ‌..

Authored By aruna | The Telugu News | Published on: July 30, 2022, 2:00 pm

Viral Video : సోష‌ల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. అందులో కొన్ని న‌వ్వు తెప్పిస్తే మ‌రికొన్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఎంతో మంది లైమ్ లైట్ లోకి వ‌స్తున్నారు. ఫాలోవ‌ర్స్ ని పెంచుకుని ఫేమ‌స్ అవుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ దుమ్ము లేపుతున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలామంది వీడియోలు తీసి షేర్ చేస్తుంటారు. కొంత‌మంది కొత్త‌గా ట్రై చేస్తూ వైర‌ల్ అవుతున్నారు. ఫ‌న్నీ వీడియోస్ చేస్తూ న‌వ్విస్తుంటారు.. డ్యాన్స్ చేస్తూ.. డైలాగులు చెప్తూ ఆక‌ట్టుకుంటున్నారు. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా డ్యాన్స్ చేస్తూ ఫేమ‌స్ అవుతున్నారు.

ఈ మ‌ధ్య కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ప‌దుల వ‌య‌సులో ఉన్న బామ్మ‌లు కూడా డ్యాన్స్ చేస్తూ దుమ్ము లేపుతున్నారు. వీళ్ల‌కి కొరియోగ్రాఫ‌ర్లు కూడా అవ‌స‌రం లేకుండా డ్యాన్స్ చేస్తూ మైఖెల్ జాక్స‌న్ ని త‌ల‌పిస్తున్నారు. 60 ఏళ్ల‌కు పైగా ఉన్న‌వారు కూడా డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇలా నెట్టింట్లో ఎన్నో వీడియోలు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ఈ వ‌య‌సులో చాలామంది కీళ్ల నొప్పుల‌తో.. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క సైలెంట్ గా ఉంటారు. కొంద‌రు మాత్రం ఏడుప‌దుల వ‌య‌సులో కూడా యాక్టివ్ గా ఉంటూ పంచులు వేస్తూ.. డ్యాన్స్ చేస్తూ వావ్ అనిపిస్తుంటారు.

Viral Video Megastar song performance by a old lady

Viral Video Megastar song performance by a old lady

ప్ర‌స్తుతం ఓ వృద్దురాలు డ్యాన్స్ చేస్తూ ప్ర‌భుదేవాను మించిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి సాంగ్ కి ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేస్తూ ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. హీరోయిన్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా అన్ని స్టెప్పులు వేస్తూ రోడ్డుపై కేక‌పెట్టిస్తోంది. దీంతో వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు కూడా వృద్దురాలు ఎన‌ర్జీకి ఫిదా అవుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి మ‌రి..

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp