Viral Video : మన భారత ఇతిహాసాల గురించి అందరికీ తెలిసిందే. ఇతిహాసాలలోని రామాయణం, మహాభారతం గురించి మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. వీటికి సంబంధించిన పుస్తకాలు చదివాం. సినిమాలు కూడా చూశాం. అయితే వీటి గురించి కొన్ని ప్రశ్నలు అడిగితే మాత్రం సమాధానాలు చాలామంది చెప్పలేరు. అయితే ఈ క్రమంలో ఇద్దరు స్కూల్ విద్యార్థులు మాత్రం భారత ఇతిహాసాల గురించి ఏమాత్రం తడబడకుండా సమాధానాలు ఇస్తున్నారు. అడిగిన ప్రశ్నలన్నింటికీ టకటకామంటూ ఆన్సర్స్ ఇస్తూ ఉన్నారు. అందరూ వీరిని చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఈ క్రమంలో వీరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ స్కూల్ పిల్లలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బ్యోమకేశ్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వైరల్ వీడియో బాగా పాపులర్ అవుతుంది. ఈ వ్యక్తి స్కూల్ యూనిఫామ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులను రామాయణం, మహాభారతం ఇతిహాసాలకు సంబంధించిన కఠినమైన ప్రశ్నలు అడుగుతాడు. దీంతో వారిద్దరూ ఏమాత్రం గుక్క తిప్పుకోకుండా సమాధానాలు ఇస్తారు. ఈ వ్యక్తి ఒక విద్యార్థిని ద్రోణాచార్యుని కుమారుడు, పాండవ సోదరులు, అర్జునుడి గురువు ఇలా మహాభారతానికి సంబంధించిన ప్రశ్నలన్నింటినీ అడుగుతాడు.
ఆ విద్యార్థి ఒక్క క్షణం ఆగకుండా సమాధానాలు చెబుతాడు. అలాగే మరొక విద్యార్థిని రామాయణం గురించి ప్రశ్నలు అడుగుతాడు. ఆ విద్యార్థి కూడా ఏమాత్రం తడబడకుండా అన్నింటికీ జవాబులు ఇస్తాడు. ‘ ఇది స్కూల్ అంటే మీ పిల్లలను ఇక్కడే చేర్పించండి ‘ అనే క్యాప్షన్ తో షేర్ చేశాడు. దీనివలన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లల ప్రతిభను మెచ్చుకుంటున్నారు. అలాగే స్కూల్ పిల్లలను ఇంతలా బాగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.