Viral Video : ఇతిహాసాల గురించి.. టకటకామని సమాధానాలు చెప్పిన స్టూడెంట్స్.. శభాష్ అంటున్న నెటిజన్లు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : ఇతిహాసాల గురించి.. టకటకామని సమాధానాలు చెప్పిన స్టూడెంట్స్.. శభాష్ అంటున్న నెటిజన్లు..

Viral Video : మన భారత ఇతిహాసాల గురించి అందరికీ తెలిసిందే. ఇతిహాసాలలోని రామాయణం, మహాభారతం గురించి మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. వీటికి సంబంధించిన పుస్తకాలు చదివాం. సినిమాలు కూడా చూశాం. అయితే వీటి గురించి కొన్ని ప్రశ్నలు అడిగితే మాత్రం సమాధానాలు చాలామంది చెప్పలేరు. అయితే ఈ క్రమంలో ఇద్దరు స్కూల్ విద్యార్థులు మాత్రం భారత ఇతిహాసాల గురించి ఏమాత్రం తడబడకుండా సమాధానాలు ఇస్తున్నారు. అడిగిన ప్రశ్నలన్నింటికీ టకటకామంటూ ఆన్సర్స్ ఇస్తూ ఉన్నారు. అందరూ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :28 July 2022,6:40 pm

Viral Video : మన భారత ఇతిహాసాల గురించి అందరికీ తెలిసిందే. ఇతిహాసాలలోని రామాయణం, మహాభారతం గురించి మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. వీటికి సంబంధించిన పుస్తకాలు చదివాం. సినిమాలు కూడా చూశాం. అయితే వీటి గురించి కొన్ని ప్రశ్నలు అడిగితే మాత్రం సమాధానాలు చాలామంది చెప్పలేరు. అయితే ఈ క్రమంలో ఇద్దరు స్కూల్ విద్యార్థులు మాత్రం భారత ఇతిహాసాల గురించి ఏమాత్రం తడబడకుండా సమాధానాలు ఇస్తున్నారు. అడిగిన ప్రశ్నలన్నింటికీ టకటకామంటూ ఆన్సర్స్ ఇస్తూ ఉన్నారు. అందరూ వీరిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఈ క్రమంలో వీరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ స్కూల్ పిల్లలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బ్యోమకేశ్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వైరల్ వీడియో బాగా పాపులర్ అవుతుంది. ఈ వ్యక్తి స్కూల్ యూనిఫామ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులను రామాయణం, మహాభారతం ఇతిహాసాలకు సంబంధించిన కఠినమైన ప్రశ్నలు అడుగుతాడు. దీంతో వారిద్దరూ ఏమాత్రం గుక్క తిప్పుకోకుండా సమాధానాలు ఇస్తారు. ఈ వ్యక్తి ఒక విద్యార్థిని ద్రోణాచార్యుని కుమారుడు, పాండవ సోదరులు, అర్జునుడి గురువు ఇలా మహాభారతానికి సంబంధించిన ప్రశ్నలన్నింటినీ అడుగుతాడు.

Viral video school boys speech about ramayanam and mahabharatham

Viral video school boys speech about ramayanam and mahabharatham

ఆ విద్యార్థి ఒక్క క్షణం ఆగకుండా సమాధానాలు చెబుతాడు. అలాగే మరొక విద్యార్థిని రామాయణం గురించి ప్రశ్నలు అడుగుతాడు. ఆ విద్యార్థి కూడా ఏమాత్రం తడబడకుండా అన్నింటికీ జవాబులు ఇస్తాడు. ‘ ఇది స్కూల్ అంటే మీ పిల్లలను ఇక్కడే చేర్పించండి ‘ అనే క్యాప్షన్ తో షేర్ చేశాడు. దీనివలన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లల ప్రతిభను మెచ్చుకుంటున్నారు. అలాగే స్కూల్ పిల్లలను ఇంతలా బాగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది