Viral Video : ఈ బుడ్డోడి బండిలో ఎవరిని తీసుకెళ్తున్నాడో చూడండి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Viral Video : ఈ బుడ్డోడి బండిలో ఎవరిని తీసుకెళ్తున్నాడో చూడండి..!

Viral Video : చిన్న పిల్లలు ఏం చేసినా సరే చూడటానికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే వారు అన్నీ తెలిసి చేయరు అదే మనకు హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే వారి చేష్టలు చూడటానికి మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. అంతే కాకుండా చూడటానికి కూడా మనసుకు ఆనందంగా అనిపిస్తాయి. అందుకే చిన్న పిల్లల వీడియోలకు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వ్యూస్ వస్తున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ చిన్న వీడియో అయినా సరే కాస్త […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 April 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral Video : ఈ బుడ్డోడి బండిలో ఎవరిని తీసుకెళ్తున్నాడో చూడండి..!

Viral Video : చిన్న పిల్లలు ఏం చేసినా సరే చూడటానికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే వారు అన్నీ తెలిసి చేయరు అదే మనకు హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే వారి చేష్టలు చూడటానికి మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. అంతే కాకుండా చూడటానికి కూడా మనసుకు ఆనందంగా అనిపిస్తాయి. అందుకే చిన్న పిల్లల వీడియోలకు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వ్యూస్ వస్తున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ చిన్న వీడియో అయినా సరే కాస్త ఆకట్టుకునే విధంగా ఉంటే ఈజీగా వైరల్ అయిపోతూ ఉంటుందనే చెప్పుకోవాలి.

Viral Video : ఈ బుడ్డోడు ధైర్యవంతుడే..

కాగా ఇప్పుడు తాజాగా ఓ బుడ్డోడి వీడియో కూడా ఇలాగే వైరల్ అవుతుంది. సాధారణంగా చిన్న పిల్లలు కోడిని లేదా కుందేలు లాంటి వాటిని చూస్తే వాటితో ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొందరు వాటితో ధైర్యంగా ఆడుకుంటే.. మరికొందరు మాత్రం వాటిని దగ్గరకు తీసుకునేందుకు కూడా భయపడుతూ ఉంటారు. అదేంటో గాని ఇప్పుడు ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తున్న బుడ్డోడు మాత్రం చాలా ధైర్యవంతుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆ బుడ్డోడు ఏకంగా కొన్ని కోళ్లు, కుందేళ్లను ముద్దు కూడా పెట్టుకుని మరీ వాటితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఇందులో ఆ బుడ్డోడు ఓ చిన్న బండినినడుపుకుంటూ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒక పెట్టెలో కోడి ఇంకో పెట్టెలో కుందేలు అన్నట్టు ఇలా కొన్ని కోళ్లను, ఇంకొన్ని కుందేళ్లను పెట్టుకుని ఆ బండిని నడుపుకుంటూ వెళ్తున్నాడు.

Viral Video ఈ బుడ్డోడి బండిలో ఎవరిని తీసుకెళ్తున్నాడో చూడండి

Viral Video : ఈ బుడ్డోడి బండిలో ఎవరిని తీసుకెళ్తున్నాడో చూడండి..!

ఇందుకు సంబంధించిన వీడియోలో ఆ కోళ్లు, కుందేళ్లు కూడా బుద్ధిగా కూర్చున్నాయి. ఇక వెంటనే ఆ బుడ్డోడు ఏ మాత్రం ఆలస్యంచేయకుండా తన బండి ఎక్కేసి దాన్ని నడుపుకుంటూ వెళ్లిపోయాడు. అయితే మధ్యలో ఆ బుడ్డోడి బండి ఓ రౌతును ఎక్కడంతో అక్కడ ఆగిపోతుంది. దాంతో మనోడు ఇంకాస్త రేస్ పెంచేసి ఎక్కించుకుని వెళ్తాడు. ఇలా ఆ బుడ్డోడు ప్రయాణం చేయడాన్ని చూసిన వారంతా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అందరూ మనుషులను ట్రావెల్ చేస్తుంటే.. ఈ బుడ్డోడు మాత్రం జంతువులను ట్రిప్ కు తీసుకెళ్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది