Viral Video : మన హిందూ సంప్రదాయంలో కొబ్బరి కాయకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కొబ్బరికాయ లేని దైవకార్యంగానీ, శుభకార్యంగానీ ఎక్కడా కనిపించవు. దేవుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు. కొబ్బరిని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు. కొబ్బరి కాయకు మూడు కన్నులు వుండటం వలన దీనిని ‘ముక్కంటి కాయ’అని కూడా అంటారు. కొబ్బరి కాయను కొట్టడం వలన అది రెండు చిప్పలుగా పగిలిపోతుంది. ఈ రెండింటిని దేవుడికి … జీవుడికి ప్రతీకగా భావించడం జరుగుతుంది.
కొబ్బరికాయకి గల మూడు కన్నుల్లోను ‘బ్రహ్మనాడి’గా చెప్పుకునే పై భాగంలోని కన్ను నుంచి మాత్రమే నీరు బయటికి వస్తుంది. ‘బ్రహ్మనాడి’ద్వారానే జీవుడు పరమాత్ముణ్ణి చేరుకోగలుగుతాడనే విషయాన్ని కొబ్బరికాయ తెలియజేస్తోంది.నిజానికి టెంకాయను మనిషి తలతో పోలుస్తారు. కొబ్బరి కాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు. అంతే కాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో, కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు. ఇక టెంకాయను కొట్టిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని మనస్సుగా భావిస్తారు. అయితే కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో వున్న కల్మషం, అహంకారం, ఈర్ష్యాద్వేషాలు అన్ని తొలగుతాయని వేద పండితులు చెబుతున్నారు. అందుకే కొబ్బరి కాయను ఆలయంలో కొడతారు.
కొబ్బరి కాయని కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే చాలా అదృష్టంగా భావిస్తారు కొందరు. అయితే ఇటీవలి కాలంలో కొబ్బరి కాయలో విచిత్రాలు కనిపిస్తుండడం మనం చూస్తున్నాం. దీపావళి సందర్భంగా తన ఇంట్లో కొట్టిన కొబ్బరికాయలో అద్భుతాన్ని చూసిన ఓ మహిళ ఆశ్చర్యానికి లోనైంది. అన్ని కొబ్బరికాయల్లో ఉన్నట్లు కాకుండా విచిత్రంగా మూడు గదుల్లాంటి కొబ్బరి కనిపించడంతో ఆమె నివ్వెర పోయింది. ఇలా ఎలా జరిగిందని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వీడియో షేర్ చేయగా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Delhi Pollution : భారతదేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం 'ఎయిర్పోకాలిప్స్' అని పిలువబడే తీవ్రమైన కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నేతలు…
Revanth Reddy : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు అందుకున్నప్పటి నుండి తెలంగాణలో రాజకీయం చాలా వాడివేడిగా…
Pushpa 2 The Rule : పుష్ప.. పుష్పరాజ్.. ఇప్పుడు ఎక్కడ చూసిన అదే వైబ్రేషన్స్. రీసెంట్గా రిలీజైన పుష్ప-2…
Gaddi Chamanthi Leaves : మనకు పకృతి అనేది సహజంగానే ఎన్నో రకాలుగా అద్భుతమైన వరాలను ఇస్తుంది. అయితే వాటిలో చాలా…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. గత సీజన్స్…
Obesity : ప్రస్తుత కాలంలో జీవనశైలి కారణం చేత చిన్న వయసులోనే యువత ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే ఇది ఇలాగే…
Silai Machine Scheme : మీరు ఇంటి నుంచి ఉపాధి కోసం చూస్తుంటే.. మంచి సంపాధన కోసం చూస్తే.. ప్రభుత్వం…
Skin Secret : కొరియన్ల లాంటి సౌందర్యం కావాలి అని అందరూ కోరుకుంటారు. అయితే దీనికోసం కొరియన్ మహిళలు అందంగా కనిపించడానికి…
This website uses cookies.