Viral Video : కొబ్బ‌రికాయ‌లో మూడు గ‌దులు.. ఇదెక్క‌డి విచిత్రం అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : కొబ్బ‌రికాయ‌లో మూడు గ‌దులు.. ఇదెక్క‌డి విచిత్రం అంటున్న నెటిజ‌న్స్

 Authored By ramu | The Telugu News | Updated on :19 November 2024,4:03 pm

ప్రధానాంశాలు:

  •  Viral Video : కొబ్బ‌రికాయ‌లో మూడు గ‌దులు.. ఇదెక్క‌డి విచిత్రం అంటున్న నెటిజ‌న్స్

Viral Video : మ‌న హిందూ సంప్ర‌దాయంలో కొబ్బ‌రి కాయ‌కి ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంటుంది. కొబ్బరికాయ లేని దైవకార్యంగానీ, శుభకార్యంగానీ ఎక్కడా కనిపించవు. దేవుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు. కొబ్బరిని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు. కొబ్బరి కాయకు మూడు కన్నులు వుండటం వలన దీనిని ‘ముక్కంటి కాయ’అని కూడా అంటారు. కొబ్బరి కాయను కొట్టడం వలన అది రెండు చిప్పలుగా పగిలిపోతుంది. ఈ రెండింటిని దేవుడికి … జీవుడికి ప్రతీకగా భావించడం జరుగుతుంది.

Viral Video ఇదొక విచిత్రం..

కొబ్బరికాయకి గల మూడు కన్నుల్లోను ‘బ్రహ్మనాడి’గా చెప్పుకునే పై భాగంలోని కన్ను నుంచి మాత్రమే నీరు బయటికి వస్తుంది. ‘బ్రహ్మనాడి’ద్వారానే జీవుడు పరమాత్ముణ్ణి చేరుకోగలుగుతాడనే విషయాన్ని కొబ్బరికాయ తెలియజేస్తోంది.నిజానికి టెంకాయను మనిషి తలతో పోలుస్తారు. కొబ్బరి కాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు. అంతే కాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో, కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు. ఇక టెంకాయను కొట్టిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని మనస్సుగా భావిస్తారు. అయితే కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో వున్న కల్మషం, అహంకారం, ఈర్ష్యాద్వేషాలు అన్ని తొలగుతాయని వేద పండితులు చెబుతున్నారు. అందుకే కొబ్బరి కాయను ఆలయంలో కొడతారు.

Viral Video కొబ్బ‌రికాయ‌లో మూడు గ‌దులు ఇదెక్క‌డి విచిత్రం అంటున్న నెటిజ‌న్స్

Viral Video : కొబ్బ‌రికాయ‌లో మూడు గ‌దులు.. ఇదెక్క‌డి విచిత్రం అంటున్న నెటిజ‌న్స్

కొబ్బ‌రి కాయ‌ని కొట్టిన‌ప్పుడు అందులో పువ్వు వ‌స్తే చాలా అదృష్టంగా భావిస్తారు కొంద‌రు. అయితే ఇటీవ‌లి కాలంలో కొబ్బ‌రి కాయ‌లో విచిత్రాలు క‌నిపిస్తుండ‌డం మ‌నం చూస్తున్నాం. దీపావళి సందర్భంగా తన ఇంట్లో కొట్టిన కొబ్బరికాయలో అద్భుతాన్ని చూసిన ఓ మహిళ ఆశ్చ‌ర్యానికి లోనైంది. అన్ని కొబ్బరికాయల్లో ఉన్నట్లు కాకుండా విచిత్రంగా మూడు గదుల్లాంటి కొబ్బరి కనిపించడంతో ఆమె నివ్వెర పోయింది. ఇలా ఎలా జ‌రిగింద‌ని ఆమె ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ వీడియో షేర్ చేయ‌గా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది