Viral Video : బెల్లీ డ్యాన్స్‌ ట్రెండింగ్.. నడుమును బొంగరంలా తిప్పేసిన యువతి!

Authored By mallesh | The Telugu News | Published on: August 24, 2022, 2:00 pm

Viral Video : బెల్లీ డ్యాన్స్.. నడుమును బొంగరంలా తిప్పుతూ చేసేలా డ్యాన్స్. ఈ రకమైన డ్యాన్స్ ఎక్కువగా అరబ్ కంట్రీస్‌లో దర్శనమిస్తుంటుంది. బెల్లీ డ్యాన్స్ చేయడం అనేది ఒక జిమ్ ఫ్యాక్టర్‌లా పనిచేస్తుందని ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది యువతులు తమ పొట్ట, బరువును తగ్గించుకోవడానికి బెల్లీ డ్యాన్స్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియా ఎప్పుడైతే మానవ జీవితంలో ఒక భాగం అయ్యిందో చాలా మంది నెట్టింట్లోనే ఎక్కువగా గడుపుతున్నారు.

స్నేహితులతో, కుటుంబానికి సమయం ఎక్కువగా కేటాయించకుండా వైరల్ వీడియోస్ చూడటం, వాటిని ఫాలో అయ్యే పనిలో నిమగ్నం అవుతున్నారు.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటిని ఫాలో అవుతున్నారు.ముఖ్యంగా అమ్మాయిలు మాత్రం బెల్లీ డ్యాన్స్‌లో అదరగొడుతున్నారు. బెల్లీ డ్యాన్స్ పుట్టింది ఇండియాలో కాకపోయినా ఈ మధ్యకాలంలో దీనికి బాగా పాపులారిటీ వచ్చింది. పెళ్లైన మహిళలు, యువతులు కూడా ఈ డ్యాన్స్ నేర్చుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఈ డ్యాన్స్ చేయడం వలన బాడీలో అనవసరమైన చోట కొవ్వుభాగం కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

young woman Best Belly dance video on youtube

young woman Best Belly dance video on youtube

జీరో సైజ్ ఫిట్నెస్ సాధించడానికి ఈ డ్యాన్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా కొందరు చెబుతున్నారు. నడుము,ఛాతి భాగంలో కొలెస్ట్రరాల్ తగ్గిపోయి ఫిట్ ఉండేందుకు ఈ డ్యాన్స్ ఎంతో ఉపయోగపడుతుంది.ఈ క్రమంలోనే ఓ అమ్మాయి బెల్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ యువతి తన నడుమును బొంగరంలా తిప్పుతూ అదిరిపోయే డ్యాన్స్ చేసింది. యువతి డ్యాన్స్ చూసిన వారంతా అది నడుమా.. బొంగరమా అలా తిప్పేస్తున్నావు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే సూపర్, వావ్ అంటూ పొగిడేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp