YCP MLA Tickets : ఆ 19 మంది ఎమ్మెల్యేలకీ టికెట్లు లేవు.. జగన్ మనసులో లిస్టు ఇదే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YCP MLA Tickets : ఆ 19 మంది ఎమ్మెల్యేలకీ టికెట్లు లేవు.. జగన్ మనసులో లిస్టు ఇదే !

 Authored By kranthi | The Telugu News | Updated on :24 June 2023,11:00 am

YCP MLA Tickets : సీఎం జగన్ ముఖ్యమంత్రి అయి నాలుగు ఏళ్లు పూర్తయింది. ఈసందర్భంగా సీఎం జగన్ గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో జనంలో ప్రజాప్రతినిధులు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. తమ నియోజకవర్గంలో ఆయా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జనంలో ఉండాలి. జనంతో మాట్లాడాలి. అయితే.. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు తిరుగుతున్నారా లేదా తెలుసుకోవడం కోసం సీఎం జగన్ ప్రత్యేకంగా సర్వేలు కూడా చేయించారు. ఆ సర్వేల్లో 19 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని సీఎం జగన్ గుర్తించారు.

సీఎం జగన్ గుర్తించిన ఆ 19 మంది ఎమ్మెల్యేలో జగన్ కు సన్నిహితులు కూడా ఉన్నారట. సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. వాళ్లు ఎవరో.. వాళ్ల పేర్లు కూడా బయటికి వచ్చేశాయి. వాళ్లలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఎక్కువ మంది రాయలసీమ నుంచే ఉండటం గమనార్హం. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, మంత్రి ఉషశ్రీ చరణ్, బద్వేలు ఎమ్మెల్యే సుధ ఉన్నారట.ఇక.. వేరే ప్రాంతాల నుంచి చూసుకుంటే.. దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్, భీమిలి ఎమ్మెల్యే, పాయకరావుపేట ఎమ్మెల్యే, బొబ్బిలి, ఎచ్చెర్ల, రాజాం ఎమ్మెల్యేలు కూడా లిస్టులో ఉన్నారట.

19 ysrcp mlas may not get ticket in next elections

19 ysrcp mlas may not get ticket in next elections

YCP MLA Tickets : మిగితా ప్రాంతాల ఎమ్మెల్యేలు వీళ్లే

వీళ్లందరి పేర్లను అధికారికంగా పార్టీ బయటపెట్టలేదు కానీ.. ట్రాక్ రికార్డు సరిగ్గా లేని ఎమ్మెల్యేలు వీళ్లే అంటూ బయట ఈ పేర్లు వైరల్ అవుతున్నాయి. వీళ్లతో త్వరలోనే సీఎం జగన్ మాట్లాడనున్నారట. అప్పటికీ వీళ్ల పనితీరు మారకపోతే మాత్రం ఈ 19 మందికి టికెట్లు ఇవ్వకుండా ఆశావహులకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది