AP Governament: ఉద్యోగ సంఘాల వినతి మేరకు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!
AP Governament: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు చాలావరకు సంచలనాలు రేపుతున్నాయి. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఉద్యోగస్తుల ప్రాధాన్యత తగ్గటం జరిగింది. ఇక ఇదే సమయంలో ఆయన మదిలోనుండి పుట్టుకొచ్చిన వాలంటీర్ మరియు గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ ద్వారా దాదాపు సగం పనులు పూర్తయిపోతున్నాయి.
ఇక ఇదే సమయంలో ఎన్నికల విధుల నుండి కూడా ఉపాధ్యాయులను ఇటీవల తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిస్థితుల ఉంటే మరోపక్క జీతాల విషయంలో ప్రభుత్వంపై ఉద్యోగస్తుల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కాగా ఇటువంటి పరిస్థితులలో ఉద్యోగ సంఘాల నేతలు ఇటీవల ప్రభుత్వ అధికారులతో భేటి కావడం జరిగింది. ఈ క్రమంలో అనేక విషయాల గురించి చర్చించారు. ఈ క్రమంలో సిఎఫ్ఎంఎస్ ద్వారా పెన్షన్ తీసుకుంటున్నందుకు రైస్ కార్డ్ అనార్హుల జాబితాలోకి.. చాలామంది పెన్షనర్లు వెళ్లిపోయారు. ఈ విషయానికి సంబంధించి.. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ అధికారులతో చర్చించడం జరిగింది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదివేల రూపాయల లోపు పెన్షన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులకు ఉరాట కలిగించే నిర్ణయం ప్రభుత్వం ప్రకటించింది. మేటర్ లోకి వెళ్తే CFMS ద్వారా పెన్షన్ తీసుకుంటున్నందుకు అనార్హుల జాబితాలోకి వెళ్లిన.. వారికి ప్రయోజనం చేకూర్చే రీతిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి రైస్ కార్డ్ అనర్హుల జాబితాలో నుండి మినహాయింపు ఇస్తూ… నిర్ణయం ప్రకటించడంతో దాదాపు 19,780 మందికీ లబ్ధి చేకూర్చినట్లు అయింది.