Telangana Lok Sabha Election Schedule : ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగా,కాంగ్రెస్ మంచి విజయం సాధించింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నగారా ఎప్పుడు మోగుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, కొద్ది సేపటి క్రితం ఎలక్షన్ కమీషన్ తేదీలని ప్రకటించింది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనుండగా, నాలుగో విడుతలో మన దగ్గర జరగనున్నాయి. మే 13వ తేదీన తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగనుండగా, జూన్ 4న ఫలితాలు రానున్నాయని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ రోజు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు. అయితే దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలలో జరగనున్నాయి.
ఏడు దశలలో జరగనున్న ఈ ఎన్నికలలో మొదటి దశ ఏప్రిల్ 19వ తేదీన 21 రాష్ట్రాల్లో జరగనుంది. ఏప్రిల్ 26వ తేదీన రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. మూడో దశ పోలింగ్ మే 7వ తేదీన జరగనుంది. ఇక నాలుగో దశ పోలింగ్ మే 13వ తేదీన ఉంటుంది. ఐదవ దశ పోలింగ్ మే 20 న జరగనుంది. ఆరవ దశ పోలింగ్ మే 25వ తేదీన జరగనుండగా, చివరి దశ 7వ దశ పోలింగ్ జూన్ 1న ఉంటుంది. జూన్ 4వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని ఎన్నికల కమీషన్ తెలియజేసింది. అయితే లోక్‌సభ తొలి దశ నోటిఫికేషన్ మార్చ్ 20న కాగా, నామినేషన్ల గడువు తేదీ మార్చ్ 27, నామినేషన్ల ఉపసంహరణ మార్చ్ 30, పోలింగ్ ఏప్రిల్ 19న ఉండనుంది.
ఇక లోక్‌సభ రెండో దశ నోటిఫికేషన్ మార్చ్ 28, నామినేషన్ల గడువు ఏప్రిల్ 4, నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 8, పోలింగ్ ఏప్రిల్ 26 కాగా, లోక్‌సభ మూడో దశ నోటిఫికేషన్ ఏప్రిల్ 12, నామినేషన్ల గడువు ఏప్రిల్ 19, నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 22, పోలింగ్ మే 7న ఉంటుంది. ఇక లోక్‌సభ నాలుగో దశ నోటిఫికేషన్ ఏప్రిల్ 18, నామినేషన్లకు గడువు ఏప్రిల్ 25, నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 29, పోలింగ్ మే 13న ఉంటుంది. లోక్‌సభ ఐదవ దశ నోటిఫికేషన్ ఏప్రిల్ 26, నామినేషన్ల గడువు మే 3, నామినేషన్ల ఉపసంహరణ మే 6, పోలింగ్ మే 20గా ఉంది. ఇక లోక్‌సభ ఆరవ దశ నోటిఫికేషన్ ఏప్రిల్ 29, నామినేషన్ల గడువు మే 6, నామినేషన్ల ఉపసంహరణ మే 9, పోలింగ్ మే 25న ఉంటుంది. లోక్‌సభ ఏడవ దశ నోటిఫికేషన్ మే 7, నామినేషన్ల గడువు మే 14, నామినేషన్ల ఉపసంహరణ మే 17, పోలింగ్ తేదీ జూన్ 1 అని తెలియజేశారు.
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
This website uses cookies.