TDP Alliance : 100 రోజుల పాలనతో గడపగడపకి కూటమి నేతలు..!
ప్రధానాంశాలు:
TDP Alliance : 100 రోజుల పాలనతో గడపగడపకి కూటమి నేతలు..!
TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20 (శుక్రవారం) తో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకుంది. దీంతో వంద రోజుల్లో తమ ప్రభుత్వం ఏం చేసిందనే అంశాన్ని ప్రజలకు వివరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బుధవారం జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో 100 రోజుల పాలన అంశంపై చర్చ జరగొచ్చని తెలుస్తోంది. వేర్వేరు శాఖలు తమ వందరోజుల ప్రణాళికల ఫలితాలపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మంత్రిత్వ శాఖలు ఇచ్చే నివేదికలపైన కూడా చర్చ జరుగనుంది. వంద రోజుల ప్రొగ్రెస్‌ను వివరించడంతోపాటు.. పలు శాఖల నివేదికలపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు.
TDP Alliance గడపగడపకి…
మరోవైపు కూటమి నాయకులు ప్రతి గడపకి వెళ్లనున్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో చేసిన మేళ్లను తీసుకున్న నిర్ణయాలను.. అమలు చేస్తున్న పథకాలను కూడా వివరించనున్నారు. ఇదేసమయంలో విపక్షం వైసీపీ నిర్లక్ష్యం గురించి కూడా ప్రచారం చేయనున్నారు. వంద రోజుల పాలనలో తొలి నాడే 7 వేల పింఛను ఇచ్చిన విషయాన్ని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్న తీరును కూడా ప్రజలకు వివరించే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వంద రోజుల పాలనపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. దానికి అనుగుణంగా పాలనలో మార్పులు చేసుకోవాలన్న ది సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉంది.
గత వంద రోజులలో ప్రభుత్వం చేసిన వివిధ పనులు, చేపట్టిన కార్యక్రమాలు, లోటు పాట్లపై సీఎం చంద్రబాబు మంత్రులు, శాసనసభ్యులకు వివరించే అవకాశం కూడా ఉంది. అలాగే వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ వైఎస్ జగన్ ఇదే తరహా కార్యక్రమాన్ని చేపట్టారు. గడప గడపకూ మన ప్రభుత్వం అనే పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలను నియోజకవర్గంలోని ప్రజల వద్దకు వెళ్లి.. ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలను వివరించే ప్రయత్నం చేశారు.