Andhra Ipl Team : ఏంటి.. అమరావతి పేరుతో ఐపీఎల్ టీమ్.. ఇది జరిగే పనేనా?
Andhra Ipl Team : ఏపీని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో స్పోర్ట్స్ హబ్ గా తయారు చేస్తామని క్రీడామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని వారు చెప్పారు. . గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని, చివర్లో ఆడుదాం ఆంధ్రా అంటూ అబాసుపాలు కార్యక్రమం నిర్వహించి, అందులోనూ రూ.120 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని […]
ప్రధానాంశాలు:
Andhra Ipl Team : ఏంటి.. అమరావతి పేరుతో ఐపీఎల్ టీమ్.. ఇది జరిగే పనేనా?
Andhra Ipl Team : ఏపీని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో స్పోర్ట్స్ హబ్ గా తయారు చేస్తామని క్రీడామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని వారు చెప్పారు. . గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని, చివర్లో ఆడుదాం ఆంధ్రా అంటూ అబాసుపాలు కార్యక్రమం నిర్వహించి, అందులోనూ రూ.120 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక ఇదిలా ఉంటే అమరావతి పేరుతో వచ్చే ఐదేళ్లలో ఐపీఎల్ క్రికెట్ జట్టును ప్రమోట్ చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు
Andhra Ipl Team ఐపీఎల్‌లో కొత్త టీం..
గల్లీ నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు క్రీడల ప్రోత్సహకానికి కృషి చేస్తామని రాం ప్రసాద్ వెల్లడించారు. క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి వారిలో క్రీడాసక్తి పెంపొందించి ఉత్తమ క్రీడాకారులుగా రాణించేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా అవసరమైన క్రీడా మైదానాలు, స్టేడియంల నిర్మాణానికి పెద్దపీట వేస్తామన్నారు. క్రీడా వికాస కేంద్రాలు, గ్రామ స్థాయిలో క్రీడల నిర్వహణ, ప్రోత్సాహంపై సీఎంతో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకు నకిలీ సర్టిఫికెట్ల వల్ల నష్టం జరుగుతుందని తమ దృష్టికి వచ్చిందని, సర్టిఫికెట్ల కుంభకోణంపై విచారణ చేసి అసలైన క్రీడాకారులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు. క్రీడలకు ప్రధాన్యత ఇవ్వడంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా విద్యార్థులు ఆడుకోవడానికి గంట సమయం కేటాయించేలా టైం టేబుల్ ఏర్పాటు చేయిస్తామన్నారు.
అలాగే క్రీడామైదానాలు లేని ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు ఇస్తామని, అవసరమైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రకు ఐపీఎల్ టీమ్ లేకుండా పోయింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సైతం వైజాగ్ పేరిట ఐపీఎల్ టీమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పిన అది జరగలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నంత మాత్రానా ఆంధ్రకు కొత్త ఐపీఎల్ టీమ్ వచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే 10 జట్లతో ఐపీఎల్ సాగుతోంది. ఇప్పట్లో జట్ల సంఖ్య పెరిగే అవకాశం కూడా లేదు. ఐపీఎల్ 2022 సీజన్ ముంగిటనే బీసీసీఐ లీగ్ విస్తరణ చేపట్టడంతో కొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు వచ్చి చేరాయి.సౌత్‌లోను కొన్ని టీమ్స్ రావడం, అవి స్ట్రాంగ్ కావడంతో అమరావతి పేరిట ఐపీఎల్ టీమ్ రావడం ఇప్పట్లో అయ్యే పనికాదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.