Andhra Pradesh Election 2024 schedule :ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుండగా, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. కొద్ది సేపటి క్రితం ఎలక్షన్ కమీషన్ షెడ్యూల్‌ని విడుదతల చేసింది. 2024 మార్చి 16న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రెస్ నోట్, ప్రకటన రిలీజ్ చేస్తూ.. ఏప్రిల్ 18న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 15గా చెప్పారు. ఇక 26 ఏప్రిల్ న నామినేషన్ల స్క్రూనిటీ జరగనుంది. అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29గా ప్రకటించింది.
ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో నేటి నుంచే ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చినట్టు తెలియజేశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఈ కోడ్ వర్తించనుండగా, రాజకీయ పార్టీలు, నేతలు తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. ఇది ఎవరైన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నామినేషన్లు ప్రారంభం – ఏప్రిల్ 18న కాగా, నామినేషన్ల చివరి తేదీ – ఏప్రిల్ 25, నామినేషన్ల పరిశీలన – ఏప్రిల్ 26, నామినేషన్ల ఉపసంహరణ – ఏప్రిల్ 29, పోలింగ్ తేదీ – మే 13, ఎన్నికల ఫలితాలు – జూన్ 4గా తెలియజేశారు.
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరిగాయి. ఆ ఎన్నికలలో టీడీపీ, జనసేన పొత్తులేదు. దీంతో వైసీపీ ఘన విజయం సాధించగా టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైన విషయం మనకు తెలిసిందే. భారీ మెజార్టీ వైసీపీకి రాగా వాళ్లు ఐదు ఏళ్లు పని చేశారు. అయితే ఈ సారి కూడా జగన్ గెలుస్తాడని గట్టిగా చెబుతున్నారు. మరోవైపు టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తులో ఉండగా, మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అంటున్నారు. టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన కూటమి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు వాడీ వేడీగా సాగనున్నాయి.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.