AP : ఇండియాలో నెంబర్ 1 స్థానం లో ఆంధ్రప్రదేశ్..!!
AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏపీలో నెలకొన్న ఏ ప్రభుత్వం ఇవ్వని రీతిలో నేరుగా లబ్ధిదారుల ఎకౌంటులలో జగన్ డబ్బులు వేస్తూ వస్తున్నారు. విద్యా, వైద్యం రాష్ట్రంలో ప్రతి పేదవారికి అందుబాటులో ఉండే రీతిలో సంచలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చదువుకు పెద్దపీట వేస్తూ కొన్ని వేల కోట్లు కేటాయించడం జరిగింది.
ఇక ఇదే సమయంలో బడుగు బలహీన వర్గాలకు కూడా ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తున్నారు. వైయస్ జగన్ తన పాలనలో ఎక్కువగా పేద వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో పేదలకు చేయని రీతిలో ఏపీలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రకంగా ఇండియాలో ఏ రాష్ట్రం కేటాయించని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. బలహీన వర్గాలకు సాయం అందించడంలో వైసీపీ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచిందట. ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
“ఎస్సీలకు సాయం చేయడంలో అగ్రగామి ఆంధ్రప్రదేశ్ అని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా ఎస్సీ ఉప ప్రణాళికలో 53.86 లక్షల కుటుంబాలు లబ్ది పొందగా ఏపీలో 51.91 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఒక్క ఏపీలోనే 96.98 శాతం మంది లభ్డిదారులు ఉన్నారు” అనీ స్పష్టం చేశారు.