School Holidays : విద్యార్థులకు మళ్లీ సెలవులు..!
ప్రధానాంశాలు:
School Holidays : విద్యార్థులకు మళ్లీ సెలవులు..!
School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు మళ్లీ కొన్ని రోజులు సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో జనవరి 16తో సంక్రాంతి సెలవులు ముగియగా, 17న శనివారం రావడంతో కొన్ని పాఠశాలలు జనవరి 19 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.ఇదిలా ఉండగా, జనవరి చివరి వారంలో జరిగే మేడారం జాతర కారణంగా మరోసారి విద్యార్థులకు వరుసగా నాలుగు రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. జనవరి 28 నుంచి 31 వరకు సమ్మక్క–సారలమ్మ మహా జాతర అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు.
School Holidays : విద్యార్థులకు మళ్లీ సెలవులు..!
School Holidays : సెలవులే సెలవులు..
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలలో ఒకటిగా గుర్తింపు పొందిన మేడారం జాతర సందర్భంగా, రహదారులు, బస్సులు, రైళ్లు భక్తులతో కిక్కిరిసిపోతాయి. అడవుల మధ్యలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే ఈ జాతరలో భక్తులు మొక్కులు చెల్లించడం, బంగారం సమర్పించడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేడారం జాతర సందర్భంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని పీర్టీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు, ప్రజా రవాణాపై వచ్చే ఒత్తిడి, భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో సెలవులు ఇవ్వడం సమంజసమని వారు అభిప్రాయపడుతున్నారు.
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సెలవుల మూడ్‌లో ఉన్న విద్యార్థులకు మరోసారి వరుస సెలవులు వచ్చే అవకాశముందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.