Bhartha Mahasayulaki Wignyapthi Movie : సంక్రాంతి టైములో ఎంత దారుణమైన కలెక్షన్ల ..? ఏంటి రవితేజ ఇది ?
ప్రధానాంశాలు:
పాపం రవితేజ బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎంత దారుణంగా పడిపోయిందా ?
Bhartha Mahasayulaki Wignyapthi Movie : మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం “ భర్త మహాశయులకు విజ్ఞప్తి ” బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. రవితేజ మార్కు వినోదం ఉన్నప్పటికీ, ఇటీవల ఆయన ఎదుర్కొన్న వరుస పరాజయాల ప్రభావం ఈ సినిమా వసూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. రవితేజ సినిమాలకు ఉండే కనీస ఓపెనింగ్స్ ఈ చిత్రానికి దక్కకపోవడం గమనార్హం. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం 2.9 కోట్ల రూపాయల కలెక్షన్లతో నెమ్మదిగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ సినిమా, రెండో రోజున మరింత సవాలును ఎదుర్కొంది. థియేటర్ల వద్ద కొత్తగా విడుదలైన మరో రెండు చిత్రాల నుండి గట్టి పోటీ ఉండటం, అలాగే సినిమాపై ఉన్న మిశ్రమ స్పందన కారణంగా ఆడియన్స్ ఈ చిత్రానికి సెకండ్ లేదా థర్డ్ ఆప్షన్‌గా మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. రవితేజ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడం కూడా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని కొంత మేర తగ్గించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Bhartha Mahasayulaki Wignyapthi Movie : సంక్రాంతి టైములో ఎంత దారుణమైన కలెక్షన్ల ..? ఏంటి రవితేజ ఇది ?
Bhartha Mahasayulaki Wignyapthi Movie : భర్త మహాశయులకు విజ్ఞప్తి ని పట్టించుకునే నాధుడు కరవయ్యాడు ?
రెండో రోజు కలెక్షన్ల ధోరణిని పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1.6 నుంచి 1.8 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆఫ్ లైన్ టికెట్ విక్రయాలు ఆశాజనకంగా ఉంటే ఈ లెక్క స్వల్పంగా పెరగొచ్చు. అయితే, స్టార్ హీరో సినిమాకు ఈ స్థాయి వసూళ్లు చాలా తక్కువని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా బి, సి సెంటర్లలో రవితేజకు ఉండే పట్టు ఈసారి అంతగా కనిపించడం లేదు. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ చిత్రం పరిమిత షోలకే పరిమితం కాగా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మరీ అద్భుతమైన ట్రెండ్ ఏమీ కనిపించడం లేదు.
Bhartha Mahasayulaki Wignyapthi Movie పర్వాలేదు అని టాక్ వచ్చిన రవితేజ సినిమాకు దారుణమైన వసూళ్లు
ప్రస్తుత ట్రెండ్ ప్రకారం, రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 2.2 కోట్ల రూపాయల మేర షేర్ సాధించే అవకాశం ఉంది. నైట్ షోల ఆక్యుపెన్సీ మరియు మౌత్ టాక్ ఆధారంగా ఈ లెక్కల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. సినిమా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవాలంటే వీకెండ్ ముగిసేలోపు వసూళ్లు భారీగా పెరగాల్సి ఉంది. రవితేజ ఎనర్జీ, మేకింగ్ వాల్యూస్ బాగున్నాయని కొందరు అంటున్నా, కథలో కొత్తదనం లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. రాబోయే రోజుల్లో ఈ ‘భర్త మహాశయుడు’ ఎంతవరకు నిలబడతాడో వేచి చూడాలి.