TDP : టీడీపీకి పొత్తుల‌ తలనొప్పి.. గెలిచే స్థానాల్లో త్యాగం చేయాలా.. కీలక నేతల అసంతృప్తి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP : టీడీపీకి పొత్తుల‌ తలనొప్పి.. గెలిచే స్థానాల్లో త్యాగం చేయాలా.. కీలక నేతల అసంతృప్తి..!

TDP : తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. సీట్ల సర్దుబాటు క్రమంలో కొన్ని సీట్లను త్యాగం చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.అందుకే బాబు బుజ్జి కన్నా అంటూ బ్రతిమిలాడాల్సి వస్తుందంటూ పలువురు తెలియజేస్తున్నారు.అయితే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే అనే సూత్రం పై చంద్రబాబు తన కేడర్ కు నచ్చచెప్పే పనిలో నిమగ్నమయ్యారు. ఒకటి కాదు రెండు కాదు సుమారు 50 సిగ్మెంట్ టికెట్లపై సర్ది చెప్పే పరిస్థితి ఏర్పడింది. 25 నుంచి 30 […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 February 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  TDP : టీడీపీకి పొత్తుల‌ తలనొప్పి.. కీలక నేతల అసంతృప్తి..!

TDP : తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. సీట్ల సర్దుబాటు క్రమంలో కొన్ని సీట్లను త్యాగం చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.అందుకే బాబు బుజ్జి కన్నా అంటూ బ్రతిమిలాడాల్సి వస్తుందంటూ పలువురు తెలియజేస్తున్నారు.అయితే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే అనే సూత్రం పై చంద్రబాబు తన కేడర్ కు నచ్చచెప్పే పనిలో నిమగ్నమయ్యారు. ఒకటి కాదు రెండు కాదు సుమారు 50 సిగ్మెంట్ టికెట్లపై సర్ది చెప్పే పరిస్థితి ఏర్పడింది. 25 నుంచి 30 స్థానాల సిట్టింగ్ ఇన్చార్జ్ లకి ఈసారి నో టికెట్ అని చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే జనసేన బిజెపి లకు 25 నుంచి 30 సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ విషయంపై ఇప్పటికే కొందరికి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ టికెట్ డైనమా లో ఉన్నవారిలో చాలామంది కీలక నేతలు కూడా ఉన్నారు. గంట , దేవినేని ఉమా , బుచ్చయ్య చౌదరి , మండల బుద్ధ ప్రసాద్ వంటి సీనియర్ నేతలకు సీట్ డైనమాలో పడింది.

ఇక రెండు సీట్ల కోసం పట్టుబడుతున్న కొందరికి స్పష్టత కూడా ఇచ్చారు. ఫ్యామిలీ ప్యాక్ చాలా కష్టమని అందుకే సింగిల్ ట్రై చేస్తామని అధినేత చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే అశోక్ గజపతిరాజు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని సమాచారం.అయితే ఇప్పటివరకు వైసిపి పార్టీ ఏ విధంగా అయితే 7 జాబితాలను విడుదల చేసి మార్పులు చేపట్టిందో అదేవిధంగా ఇప్పుడు టిడిపి పార్టీ కూడా చేసే విధంగా కనిపిస్తుందని పలువురు తెలియజేస్తున్నారు. అయితే వైసిపి పార్టీలో పక్కకు పెట్టిన నాయకులను బుజ్జగించడం ముగింపు దశకు చేరుకోగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బుజ్జగించటం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇక పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చల మేరకు చూసుకున్నట్లయితే దాదాపు 50 నుంచి 60 స్థానాలలోని నేతలకు అలాగే క్యాడర్ కు నచ్చ చెప్పుకోవాల్సిన పరిస్థితి టీడీపీ నాయకత్వానికి కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు 25 – 30 స్థానాలను సిట్టింగ్ ఇన్చార్జిల్ గా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వారికి కాకుండా కొత్త అభ్యర్థులకు కూడా టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు 25 నుంచి 30 స్థానాలు జనసేన మరియు బిజెపి ఈ రెండు పార్టీలు కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో 50 నుంచి 60 స్థానాల లో నేతలకు స్థానచలన కావచ్చు టికెట్ లేకపోవడం కావచ్చు అనే పరిస్థితులు ఎదురవుతాయని సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో టీడీపీ పార్టీ కూడా బుజ్జగింపుల పర్వం చేపట్టిందని తెలుస్తోంది . అంతేకాక కీలక నేతలకు టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉండడంతో వారిని కూడా సముదాయించేందుకు పూనుకుంది. అయితే టిడిపి పార్టీలో ఇప్పటివరకు టికెట్ల విషయంపై క్లారిటీ లేని నేతల విషయానికొస్తే… గంట శ్రీనివాసరావు , బండ సత్యనారాయణ మూర్తి, పిఠాపురం నియోజకవర్గం నుంచి వర్మ , దేవినేని ఉమ, బుచ్చయ్య చౌదరి వంటి కీలక నేతలకు కూడా టికెట్లపై క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఇటీవల పార్టీలో చేరిన ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి, సోమిరెడ్డి కి కూడా టికెట్లు విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇలాంటి తరుణంలో ఇటువంటి ముఖ్యమైన నేతలను బుజ్జగించే కార్యక్రమం టిడిపి పార్టీ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది