YS Jagan : క్రిస్టల్ క్లియర్ గా ఉన్న వైఎస్ జగన్ – మిగితా వాళ్ళే కన్ఫ్యూజన్ లో కొట్టుకుంటున్నారు !
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం కూడా సమయం లేదు. అందుకే ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయాత్తం అవుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. ఇక పార్టీలు కూడా తమ వ్యూహాలను రచించే పనిలో బిజీగా ఉన్నాయి. అధికార పార్టీకి ఎలాగూ మరోసారి గెలిచి రెండోసారి అధికారంలోకి రావాలని ఉంటుంది. వైసీపీకి కూడా అంతే. తొలిసారి అధికారంలోకి వచ్చినా.. ఎలాంటి పాలన అనుభవం లేకున్నా జగన్ ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారు. అనుకున్నదానికంటే ఎక్కువే అభివృద్ధి చేసి చూపించారు.
ఏపీలో సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో లేవు. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ. ఆ వ్యవస్థను ఇప్పటి వరకు ఎవ్వరూ తీసుకురాలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం వాలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్నారు. వాలంటీర్ల ద్వారానే ఏపీలోని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇప్పుడు ఏ మారు మూల గ్రామం తీసుకున్నా.. ఏ కుటుంబం తీసుకున్నా ప్రభుత్వం సంక్షేమ పథకం లబ్ధి పొందని కుటుంబం లేదు. అందుకే.. సంక్షేమ పథకాల లబ్ధి పొందిన వారంతా సీఎం జగన్ వైపే ఉన్నారు. వాళ్లంతా వైసీపీకి ఓటేసినా చాలు.. ఏపీలో ఉన్న 175 సీట్లకు 175 సీట్లను వైసీపీ గెలుచుకోగలదు. అందుకే సీఎం జగన్ కూడా ఎన్నికల విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు.
YS Jagan : ఒక్క వైసీపీని ఓడించేందుకు మూడు పార్టీలు ఏకం కాబోతున్నాయా?
ఇక.. ఏపీలో అధికారంలో ఉన్న ఒక్క వైసీపీ పార్టీని ఓడించడానికి.. ప్రతిపక్షాలు అన్నీ ఏకం కాబోతున్నాయి. ప్రతిపక్షాలు అన్నీ ఏకం అయ్యి వైసీపీని గద్దె దించాలని భావిస్తున్నా.. వాళ్లలో వాళ్లకే క్లారిటీ లేదు. అసలు పొత్తులపై స్పష్టత లేదు. అలాంటి వాళ్లు వైసీపీని ఓడించడం పక్కన పెడితే అసలు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో వాళ్లే క్లారిటీ తెచ్చుకోవాలి. అసలు.. వైసీపీని ఎలా ఓడించాలో కూడా ప్రతిపక్ష పార్టీలకు క్లారిటీ లేదు. అందుకే వాళ్లు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్లకే అర్థం కావడం లేదు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. సీఎం జగన్ మాత్రం ఒక క్లారిటీతో ముందుకెళ్తున్నారు.. సరైన క్లారిటీ లేక ప్రతిపక్షాలు తప్పటడుగు వేస్తున్నాయి.