YS Jagan : క్లాస్ వార్ అంటే అదా.. సీఎం జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అయినట్టే.. ఇది పక్కా.. రాసిపెట్టుకోండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : క్లాస్ వార్ అంటే అదా.. సీఎం జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అయినట్టే.. ఇది పక్కా.. రాసిపెట్టుకోండి

YS Jagan : కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశంలో సరికొత్త ఆశను నెలకొల్పాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు నిజానికి ఊహించినవే. చాలా రోజుల నుంచి అక్కడ కాంగ్రెస్ పుంజుకుంటోంది. మెల్లమెల్లగా తాను కోల్పోయిన ఆస్తిత్వాన్ని మళ్లీ నిలబెట్టుకుంటోంది కాంగ్రెస్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కర్ణాటక ఫలితాలు తెలుగు రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే […]

 Authored By kranthi | The Telugu News | Updated on :14 May 2023,3:00 pm

YS Jagan : కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశంలో సరికొత్త ఆశను నెలకొల్పాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు నిజానికి ఊహించినవే. చాలా రోజుల నుంచి అక్కడ కాంగ్రెస్ పుంజుకుంటోంది. మెల్లమెల్లగా తాను కోల్పోయిన ఆస్తిత్వాన్ని మళ్లీ నిలబెట్టుకుంటోంది కాంగ్రెస్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కర్ణాటక ఫలితాలు తెలుగు రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలిచే చాన్స్ ఉందా అనే చర్చ మొదలైంది.

ap cm ys jagan says that clash between those parties

ap cm ys jagan says that clash between those parties

నిజానికి తెలంగాణలో ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. మరోవైపు ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. ఏపీలో ఈసంవత్సరం ఎన్నికలు వచ్చే చాన్సే లేదు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావు.. అంటూ వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ఐదేళ్లు పూర్తయ్యాకే ఏపీలో ఎన్నికలు వస్తాయంటున్నారు వైసీపీ నేతలు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

chandrababu and pawan kalyan are not able to expect jagan planning

chandrababu and pawan kalyan are not able to expect jagan planning

YS Jagan : క్లాస్ వార్ అనే పదాన్ని జగన్ ఎందుకు వాడుతున్నట్టు?

ఈ మధ్య మీరు గమనించారో లేదో.. చాలా రోజుల నుంచి సీఎం జగన్ ఒక పదాన్న పదే పదే వాడుతున్నారు. అదే క్లాస్ వార్. క్లాస్ వార్ అంటే.. ప్రభుత్వ పథకాలు పొందే వారు, ప్రభుత్వ పథకాలు పొందని వారి మధ్య జరిగే వారు. ప్రభుత్వ పథకాలను పొందే వాళ్లు ఎలాగైనా వైసీపీకి ఓటేస్తారని, ఇక.. ప్రభుత్వ పథకాలు పొందని వారు, వాటి అవసరం లేని వారు.. వైసీపీకి కాకుండా వేరే పార్టీలకు ఓటేస్తారని తెలుస్తోంది. ఈ ఫార్ములాను చూసుకున్నా ఖచ్చితంగా ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీనే. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఎలాంటి హామీలు ఇచ్చిందో.. ఆ హామీలు అన్నింటినీ నెరవేర్చడమే కాదు.. కొత్త పథకాలను కూడా తీసుకొచ్చింది. అందుకే ఇప్పుడు గతంలో పాలన ఎలా ఉంది. ఇప్పుడు వైసీపీ పాలన ఎలా ఉంది అంటూ ప్రతి గడపకు వెళ్లి సర్వే చేసి మరీ.. జగనన్నే మా అండ అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేస్తోంది. ఈ క్లాస్ వార్ ను దృష్టిలో పెట్టుకున్న వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచేది మళ్లీ వైసీపీనే అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది