“విశాఖ” యే ఏకైక రాజధాని అంటూ పరోక్షంగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో ఓ సదస్సులో పాల్గొనడం జరిగింది. విశాఖపట్నంలో మార్చి 3 4 తారీఖులలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు సంబంధించి దేశవ్యాప్తంగా పలు పేరుగాంచిన నగరాలలో పలు సదస్సులలో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అమర్నాథ్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిన్న బెంగళూరులో జరిగిన ఓ సదస్సులో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానులు అంటూ ప్రజల్లోకి మిస్ కమ్యూనికేట్ అయిందని అన్నారు. ఏపీ పరిపాలన విశాఖ నుంచి జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో ఏపీకి విశాఖ ఒకటే రాజధాని అన్నట్టు పరోక్షంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా ఈ సదస్సులో విశాఖలో అందుబాటులో ఉన్న మౌలిక వసతుల పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖే రాజధానిగా ద బెస్ట్ అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచి జరుగుతుంది. తమ ప్రభుత్వం నిర్ణయం కూడా ఇదే అని పేర్కొన్నారు. ఆల్రెడీ విశాఖపట్నంకి ఓడరేవు నగరం..కాస్మోపాలిటన్ సిటీగా మంచి గుర్తింపు ఉంది.
భవిష్యత్తులో విశాఖ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక కర్నూలు రెండో రాజధానిగా ఉండదు అక్కడ కేవలం హైకోర్టు ప్రధాన బెంచ్… ఉంటుంది అని పేర్కొన్నారు. దీంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలను అధికార పార్టీ తప్పుదోవ పట్టిస్తుందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ముందు మూడు రాజధానులు అని మళ్లీ ఇప్పుడు విశాఖపట్నం ఏకైక రాజధాని అన్నట్టు బుగ్గన చేసిన వ్యాఖ్యలను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చె నాయుడు ఖండించారు.