AP Free Bus : ఏపీ మహిళలకు శుభవార్త.. ఫ్రీ బస్సు పై కీలక అప్డేట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Free Bus : ఏపీ మహిళలకు శుభవార్త.. ఫ్రీ బస్సు పై కీలక అప్డేట్..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 November 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  AP Free Bus : ఏపీ మహిళలకు శుభవార్త.. ఫ్రీ బస్సు పై కీలక అప్డేట్..!

AP Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే క్యాబినెట్ మీటింగ్ లో కొన్ని ప్రధాన నిర్ణయాలను తీసుకోవాలని తెలుస్తుంది. నవంబర్ 20 సాయంత్రం 4 గంటలకు ఇది షెడ్యూల్ చేయబడింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో మహిళా సంక్షేమం ఇంకా ఇతర సమస్యల మీద కార్యక్రమాలను దృష్టి సారించేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. కేబినెట్ మీటింగ్ లోని ముఖ్యాంశాలు ల గురించి చూస్తే.. కీలకమైన పండగ సంక్రాంతి నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇది అమలు అయితే ఎంతోమంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్ధిక ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఐతే మహిళా శంక్షేమం, ప్రజాసేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చిరవ చూపిస్తుంది.

AP Free Bus ఏపీ మహిళలకు శుభవార్త ఫ్రీ బస్సు పై కీలక అప్డేట్

AP Free Bus : ఏపీ మహిళలకు శుభవార్త.. ఫ్రీ బస్సు పై కీలక అప్డేట్..!

ఇక వీటిలో భాగంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ అరికట్టేందుకు చట్టం ప్రవేశ పెట్టాలని చూస్తున్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని చేసే ఇలాంటి పోస్ట్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ చట్టం లక్ష్యంగా పెట్టుకుంది. సోషల్ మీడియాలో అంచిత పోస్ట్ లు పెట్టే వారి మీద ప్రభుత్వం కొరడా చూపించేందుకు సిద్ధమవుతుంది.

AP Free Bus స్కిల్ డెవలప్మెంట్, వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై..

వీటితో పాటుగా స్కిల్ డెవలప్మెంట్, వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై కూడా మంత్రి వర్గం చర్చిస్తుందని తెలుస్తుంది. ప్రభుత్వ బిల్లులు ఇంకా పెండింగ్ ఉన్న సమస్యల గురించి మంత్రివర్గం చరించే ఛాన్స్ ఉంది. రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ, అమ్మవందనం ఇలా అన్నిటి మీద నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీ ఫ్రీ బస్ పై ఈ సమావేశంలో ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

ఏపీ లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తుంది. తెలంగాణాలో ఆల్రెడీ ఉచిత బస్సు పథకం అమలులో ఉంది. ఏపీలో కూడా ఈ ఉచిత బస్సు పథకం అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతి నుంచైనా సరే ఉచిత బస్సు పథకం అమలు చేస్తారా లేదా అన్నది మంత్రివర్గ సమావేశంలో తెలుస్తుంది. AP Free Bus Good News or Women Free Bus , AP, AP Free Bus, Good News, Women Free Bus

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది