AP Free Bus : గుడ్ న్యూస్ .. ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తేది ఖరారు..!.. కానీ ఒక కండిషన్..??
ప్రధానాంశాలు:
AP Free Bus : గుడ్ న్యూస్ .. ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తేది ఖరారు..!.. కానీ ఒక కండిషన్..??
AP Free Bus : ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలకు రంగం సిద్ధమవుతుంది. ఈ పథకం అమలుపైన ఆర్థిక భారం, పొరుగు రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యల పైన ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వరుస సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అధికార వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని బాగా వినియోగించుకుంటుంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతుండడంతో సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఈ పథకం అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ పథకాన్ని సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. పథకం అమలు కారణంగా సంస్థ పైన పడే భారం పైన అధికారులు నివేదిక ఇచ్చారు.
ఆల్రెడీ ఈ పథకం కర్ణాటక తెలంగాణలో అమలు అయింది అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కర్ణాటక, తెలంగాణలో అమలు సమయంలో ఎదురవుతున్న సమస్యల పైన అధికారులు ప్రభుత్వానికి వివరించారు. పురుషులకు తలెత్తుతున్న ఇబ్బందులు, ఆటో కార్మికుల నుంచి వస్తున్న వ్యతిరేకత గురించి ఆ నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఎవరి నుంచి వ్యతిరేకత లేకుండా మహిళలకు ఈ పథకం అమలయ్యేలా కొత్త విధివిధానాలను వైసీపీ ప్రభుత్వం ఖరారు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి నివేదిక సిద్ధం చేసిన తర్వాత సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పై మంచి స్పందన కనిపిస్తుంది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్టీసీలో నిత్యం సగటును 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 15 లక్షలకు పైగా మహిళలు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీకి రోజుకు సగటున 17 కోట్లు చొప్పున నెలకు 500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే 150-180 కోట్ల వరకు రాబడి కోల్పోయే అవకాశం ఉంది. దీనిపైన అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో పాటుగా ఇప్పటికీ ఆర్టీసీకి చెందిన రుణాలు, రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వం నుంచి అందుతున్న ఆర్థిక ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటున్నారు.
ఈ పథకాన్ని అమలు చేసినా ఏ వర్గానికి ఇబ్బందులు, వ్యతిరేకత లేకుండా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అంశాల పైన అధ్యయనం చేస్తున్నారు. అన్ని వివరాలు సేకరించి ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులు నివేదిక ఇచ్చారు. దీనిని ఆర్థిక రవాణా శాఖ అధికారులు అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రి కి తుది నివేదిక ఇవ్వనున్నారు. దీనిపైన సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపుగా ఈ పథకం సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశం ఉందని సమాచారం.