Ap Registration : ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేష‌న్ విష‌యంలో పెను మార్పులు.. గుడ్ న్యూస్ చెప్పిన స‌ర్కారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ap Registration : ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేష‌న్ విష‌యంలో పెను మార్పులు.. గుడ్ న్యూస్ చెప్పిన స‌ర్కారు

 Authored By ramu | The Telugu News | Updated on :14 February 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Ap Registration : ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేష‌న్ విష‌యంలో పెను మార్పులు.. గుడ్ న్యూస్ చెప్పిన స‌ర్కారు

Ap Registration : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో Andhra pradesh కూట‌మి ప్ర‌భుత్వం వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్ర‌మాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ క్ర‌మంలో ఆస్తుల రిజిస్ట్రేష‌న్ Registrations విష‌యంలోను ప్ర‌క్షాళ‌న చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల్లో బ్రిటీష్ కాలం నాటి రెడ్ టేబుల్ పోడియం వ్యవస్థను తొలగించింది. అధికార దర్పానికి చిహ్నంగా ఉన్న ఆ పోడియాలను తొలగించింది. అలాగే రిజిస్ట్రేషన్ల విలువల్లో మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.

Ap Registration ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేష‌న్ విష‌యంలో పెను మార్పులు గుడ్ న్యూస్ చెప్పిన స‌ర్కారు

Ap Registration : ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేష‌న్ విష‌యంలో పెను మార్పులు.. గుడ్ న్యూస్ చెప్పిన స‌ర్కారు

Ap Registration వెయిటింగ్ అక్క‌ర్లేదు..

ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే సబ్ -రిజిస్ట్రార్ ఆఫీసులకు వచ్చి పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చుని రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకుంటే చాలు. ఆ త‌ర్వాత అధికారులు ఇచ్చిన స‌మ‌యానికి వెళితే స‌రిపోతుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్ర‌క్రియ‌ని ముందుగా జిల్లా కేంద్రాల్లో ఉన్న రిజిస్టార్ ఆఫీసుల్లో అందుబాటులోకి తెస్తారు. ఆ తర్వాత క్రమంగా అన్ని ఆఫీసులకు వర్తింపజేస్తారు.

ఇంకో విష‌యం ఏంటంటే దీనికి ఎలాంటి ఛార్జీలు కూడా లేవు. అయితే స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం రూ.100, , రీషెడ్యూలింగ్ కు అయితే రూ.200 వసూలు చేయాలని నిర్ణయించారు. పని దినాల్లో సాయంత్రం 5 గంటల వరకూ ఇలా స్లాట్స్ బుక్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. సెలవు దినాల్లో స్లాట్ కావాలంటే మాత్రం 5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కాస్త ఇబ్బంది క‌లిగించే విధంగా ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది