AP DWCRA Women Loans : ఏపీలో డ్వాక్రా మహిళలకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..5 లక్షల వరకూ..!
ప్రధానాంశాలు:
AP DWCRA Women Loans : ఏపీలో డ్వాక్రా మహిళలకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..5 లక్షల వరకూ..!
AP DWCRA Women Loans : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక అందరిని ఆనందింపజేసే ప్రయత్నం చేస్తుంది. ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా అమలుజేస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. పొదుపు సంఘాల్లోని మహిళల కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా.. బ్యాంకుల ద్వారా ఇస్తున్న గ్రూప్ రుణాలతోపాటు.. పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకూ మహిళలను తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రోత్సహించిన ప్రభుత్వం.. ఇకపై వారికి వ్యక్తిగతంగానూ లబ్ది చేకూర్చేందుకు సిద్దమవుతోంది.
AP DWCRA Women Loans మహిళలకి గుడ్ న్యూస్..
ఇందులో భాగంగా సెర్ప్ ద్వారా ఆర్ధిక సాయం చేయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల కాబోతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. రాష్ట్రవ్యాప్తంగా రూ.2 వేల కోట్ల మేర లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు వ్యక్తిగత రుణాలు అందించాలని సెర్ప్ అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. వీరిలో 1.35 లక్షల మందికి రూ.లక్ష.. అలాగే 15 వేల మందికి రూ.5 లక్షల రుణాలను అందించాలని భావిస్తున్నారు. డ్వాక్రా గ్రూపులో ఒకేసారి గరిష్టంగా ముగ్గురికి లక్ష నుంచి 5 లక్షల వరకూ ఈ పర్సనల్ లోన్ బ్యాంకుల ద్వారా ఇప్పించనున్నారు. తద్వారా వారి ఆర్ధిక పరిస్ధితి మరింత మెరుగవుతుందని భావిస్తున్నారు.
ఈ ఆర్ధిక సంవత్సరంలో 2 వేల కోట్ల వరకూ ఇలా డ్వాక్రా గ్రూపుల్లో మహిళలకు పర్సనల్ లోన్లు ఇప్పించాలని సెర్ప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే యూనిట్లు నడుపుతున్న వారితో పాటు కొత్తగా యూనిట్లు ప్రారంభించాలనుకునే వారికీ ఈ లోన్లు ఇప్పిస్తారు. ఇలా మొత్తం లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు ఈ ఆర్ధిక సంవత్సరంలో లోన్లు ఇప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో లక్షా 35 వేల మందికి లక్ష రూపాయల చొప్పున, మిగిలిన 15 వేల మందికి 5 లక్షల చొప్పున లోన్లు ఇప్పిస్తారు. భవిష్యత్తులో ఈ లోన్ ను రూ.10 లక్షలకు పెంచే అవకాశమున్నట్లు సెర్ఫ్ అధికారులు చెప్తున్నారు. తీసుకున్న బ్యాంకు రుణంలో 35 శాతం రాయితీ కూడా వర్తిస్తుంది. అంటే రూ.లక్ష రుణం తీసుకుంటే రూ.35 వేలు రాయితీ కింద మినహాయింపు ఇస్తారు. రుణంలో మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.