AP Dwcra Women : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే వాయిదాలు చెల్లించే అవకాశం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Dwcra Women : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే వాయిదాలు చెల్లించే అవకాశం..!

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :14 May 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Dwcra Women : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే వాయిదాలు చెల్లించే అవకాశం..!

AP Dwcra Women : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా మహిళల సాధికారతపై దృష్టి పెట్టిన చంద్రబాబు.. డ్వాక్రా మహిళలకు మేలు చేకూర్చే విధంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా రుణాల చెల్లింపును సులభతరం చేయడం, మోసాలను అరికట్టడం కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ యాప్ ద్వారా మహిళలు ఇంటి నుంచే వాయిదాలు చెల్లించే అవకాశం ఉండబోతోంది.

AP Dwcra Women డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ ఇంటి నుంచే వాయిదాలు చెల్లించే అవకాశం

AP Dwcra Women : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే వాయిదాలు చెల్లించే అవకాశం..!

AP Dwcra Women : డ్వాక్రా మహిళలకోసం ప్రత్యేక యాప్ తీసుకొస్తున్న ఏపీ సర్కార్..!

మెప్మా అధికారుల ప్రకారం.. స్త్రీనిధి రుణాల వాయిదాలను ఈ యాప్ ద్వారా భద్రంగా చెల్లించవచ్చు. గతంలో కొన్ని చోట్ల చోటుచేసుకున్న మోసాలను అడ్డుకునేందుకు ఈ యాప్ ఉపయోగకరంగా ఉండనుంది. బ్యాంకు లింకేజీ, రుణాల వివరాలు, చెల్లింపుల ట్రాక్ అన్నీ ఈ యాప్‌ ద్వారా పారదర్శకంగా నడిపించవచ్చని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా మహిళలకు ఆర్థిక ప్రగతి మార్గం సులభమవుతుంది.

తాజాగా విజయవాడలో జరిగిన మెప్మా కార్యక్రమంలో మంత్రి నారాయణ ఈ విషయాలను వెల్లడించారు. మెప్మా వెబ్‌సైట్‌ను ప్రారంభించి, భవిష్యత్తులో 80 వేల డ్వాక్రా సంఘాలకు 8 వేల కోట్ల రూపాయల రుణాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల మెప్మా పీడీలను 26 జిల్లాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రజల్లో విశ్వాసం పెంచుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది