Chandrababu : డ్వాక్రా మహిళలకు చంద్రన్న గుడ్ న్యూస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : డ్వాక్రా మహిళలకు చంద్రన్న గుడ్ న్యూస్..!

 Authored By ramu | The Telugu News | Updated on :7 June 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : డ్వాక్రా మహిళలకు చంద్రన్న గుడ్ న్యూస్..!

Chandrababu : ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం విద్యా పరంగా కొత్త ప్రయోజనాత్మక పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం పాలనలో ఏడాది పూర్తవుతుండగా, పలు ప్రజాప్రయోజన నిర్ణయాల్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డ్వాక్రా మహిళల పిల్లల చదువులను ప్రోత్సహించడానికి ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పేరుతో ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకి విద్యారుణాలు అందించనున్నారు.

Chandrababu డ్వాక్రా మహిళలకు చంద్రన్న గుడ్ న్యూస్

Chandrababu : డ్వాక్రా మహిళలకు చంద్రన్న గుడ్ న్యూస్..!

Chandrababu డ్వాక్రా మహిళలకు రూ.1 లక్ష రూపాయిలు అందిస్తున్న ఏపీ సర్కార్

ఈ పథకానికి ఏటా రూ.200 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా డ్వాక్రా మహిళలకు కేవలం 4% వడ్డీకే రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకూ విద్యారుణం లభించనుంది. ఈ రుణం కేజీ నుండి పీజీ వరకు పిల్లల చదువులకు ఉపయోగపడేలా రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఇది వర్తించనుంది. ఫీజులు, పుస్తకాలు, యూనిఫారమ్‌లు, సైకిళ్లు, సాంకేతిక విద్య సామగ్రి వంటి అవసరాలకు ఈ నిధులను వినియోగించవచ్చునని అధికారులు తెలిపారు.

ఈ పథకాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. రుణం తీసుకున్న తర్వాత అది విద్య అవసరాలకే వినియోగించారన్న రుజువుగా సంబంధిత రశీదులను స్త్రీనిధికి సమర్పించాల్సి ఉంటుంది. రుణ మొత్తాన్ని 24 నుంచి 36 నెలల మధ్యలో వాయిదాల రూపంలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించనున్నారు. విద్య ద్వారా కుటుంబ అభివృద్ధి సాధించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకానికి త్వరలోనే ప్రభుత్వ గెజిట్‌లో ప్రకటన వెలువడనుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది