AP Nominated Posts: నామినేటెడెడ్ పదవులు ఎవరికి ఎన్ని పంచుకుంటున్నారు.. ఏపీలో కూటమి ఏం చేయబోతుంది..?
ప్రధానాంశాలు:
AP Nominated Posts: నామినేటెడెడ్ పదవులు ఎవరికి ఎన్ని పంచుకుంటున్నారు.. ఏపీలో కూటమి ఏం చేయబోతుంది..?
AP Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పదవుల గురించి అప్పుడే పని మొదలు పెట్టారు. పోస్టులకు ఎవరికి ఎన్ని ఇవ్వాలో అనే విషయంపై కసరత్తు మొదలైనట్టు తెలుస్తుంది. నామినేటెడ్ పదవుల భర్తీ పైన మూడు పార్టీల అధిష్టానం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మూడు పార్టీలకు ప్రాధాన్యత ఇచ్చేలా సమన్యాయం జరిగేలా చర్చలు చేస్తున్నారు. ఇప్పటికే వారి చర్చల సారంగా ఒక ఫార్ములా రెడీ చేశారు. అన్ని నియోజక వర్గాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పదవులకు ఏయే రేషియో కింద తీసుకోవాలని సూత్ర ప్రయంగా నిర్ణయించారు. ఈ క్రమంలో త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ మొదలు చేయనున్నారు.
AP Nominated Posts ఒప్పందం కుదిరిందా..
ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఇప్పటికే కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది. టీడీపీ లో జనసేనలో ఎమ్మెల్యే టికెట్లు ఆశించి నిరాశకు లోనైన వారి లిస్ట్ పెద్దగానే ఉంది వారిలో కొందరికి ఈ పదవులు దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే వారిలో వారే ఈ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. వీటిపై అందరు నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఐతే ఈ పోస్టుల విషయంలో 3 పార్టీల నేతలు కీలక ఒప్పందం చేసుకున్నారు.
ఎమ్మెల్యేలు ఉన్న చోట 60 శాతం నామినేటెడ్ పోస్టులు ఆ పార్టీ కార్యకర్తలకే దక్కుతాయి. 30 శాతం జనసేన కార్యకర్తలకు మిగతావి బీజేపీ కార్యకర్తలకు లభిస్తాయి. . ఇక జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట 60 శాతం ఆ పార్టీకి మిగతా దానిలో 30 టీడీపీ, 10 బీజేపీకి ఇవ్వనున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మిగిలిన 50 శాతం టీడీపీ, జనసేనకి కేటాయించనున్నారు.