Kodali Nani : నానిని ఎక్కడికి వెళ్లకుండా చేసిన టీడీపీ సర్కార్..!
ప్రధానాంశాలు:
Kodali Nani : నానిని ఎక్కడికి వెళ్లకుండా చేసిన టీడీపీ సర్కార్..!
Kodali Nani : వైసీపీ నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రస్తుతం తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆయన గుండె సంబంధిత చికిత్స కోసం ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ విదేశాలకు వెళ్తారని అనుమానంతో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కృష్ణా జిల్లా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు సమాచారం అందించబడింది. ఇప్పటికే కొడాలి నాని పై అనేక కేసులు నమోదు కాగా, ఆయన్ని కోలుకున్న వెంటనే విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Kodali Nani : నానిని ఎక్కడికి వెళ్లకుండా చేసిన టీడీపీ సర్కార్..!
ఇక ఆయన అత్యంత సన్నిహితుడైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. వంశీపై ఎనిమిది కేసులు ఉండగా, ఆయన కూడా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో అధికారమే శాశ్వతమని భావించి వ్యవహరించడం, పరిస్థితులు మారిన తర్వాత తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని తాజా పరిస్థితులు చూపిస్తున్నాయి. ఈ నేతలపై ప్రస్తుతం ప్రతీకార రాజకీయాలు కొనసాగుతున్నాయనే అభిప్రాయం రాజకీయం వర్గాల్లో వినిపిస్తోంది.
కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలు గతంలో నోటికొచ్చినట్లుగా మాట్లాడటం, విమర్శలు చేయడం వల్లే ఇప్పుడు చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత పరిస్థితులు ఎలా మారతాయో ఈ సందర్భం స్పష్టంగా చాటుతోంది. ప్రస్తుతం ట్రెండ్ చూస్తే..కొడాలి నాని అరెస్టు కూడా దాదాపుగా ఖాయమని భావిస్తున్నారు. ఇదే తరహాలో అధికార సమయంలో బాధ్యతలతో వ్యవహరించకపోతే, దాని ప్రభావం ఎలా ఉంటుందో వైసీపీ కీలక నేతలు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు.