Vizag : ఇప్పుడు గుర్తొచ్చిందా వైజాగ్.. అందరి చూపు దీనివైపే.. సీఎం చాన్స్ ఎవరికిస్తారో?
Vizag : వైజాగ్ ను అంత తక్కువ అంచనా వేయొద్దు. ఏదో ఉత్తరాంధ్ర కదా. ఎక్కడో మూలకు ఉంటుంది కదా అని తీసిపారేస్తే రాత్రికి రాత్రే రాజకీయాలు మారిపోతాయి. అందుకే వైజాగ్ ను తక్కువ అంచనా వేయకూడదని ఏపీలోని ప్రధాన పార్టీలకు అర్థం అయినట్టుంది. అందుకే ఇప్పుడు వైజాగ్ కేంద్రంగా రాజకీయాలను నడిపిస్తున్నాయి. అందుకే కదా వైజాగ్ ను పరిపాలన రాజధాని చేసి త్వరలోనే అక్కడి నుంచి పాలన సాగించాలని సీఎం జగన్ తహతహలాడతున్నారు.
గతంలో కూడా వైజాగ్ ను అంతగా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందుకే వైజాగ్ ప్రజలు అన్ని పార్టీల మీద కాస్త గుర్రుగానే ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే సీఎం అభ్యర్థిని డిసైడ్ చేసేదే ఉత్తరాంధ్ర ప్రజలు. అందుకే వాళ్లు ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీకే గెలిచే చాన్స్ ఉంటుంది. వచ్చే సంవత్సరమే ఎన్నికలు. అందుకే ఇప్పటి నుంచే ఉత్తరాంధ్ర ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. అందుకే సీఎం జగన్ కూడా వైజాగ్ నుంచి పాలన సాగించాలని.. వచ్చే దసరా నుంచే ఆయన వైజాగ్ నుంచి పాలన ప్రారంభించే అవకాశం ఉంది.
Vizag : పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా వైజాగ్ మీదనే దృష్టి
ఇక.. ప్రతిపక్ష పార్టీలు కూడా వైజాగ్ మీద దృష్టి సారించాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్షాలు ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో పరిపాలన వికేంద్రీకరణ అని ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుండటంతో.. ప్రతిపక్షాలు కూడా పాలనా వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా తన వారాహి యాత్ర మూడో విడత వైజాగ్ కేంద్రంగా జరగనుంది. చంద్రబాబు కూడా వైజాగ్ పై దృష్టి సారించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఒక్కసారిగా అందరి చూపు వైజాగ్ మీదికి మళ్లడంతో వైజాగ్ ప్రజలు ఎవరి వైపు నిలిస్తే వాళ్లకే సీఎం పీఠం దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.