AP Volunteer : ఏపీ వాలంటీర్లకి బిగ్ బ్రేకింగ్ న్యూస్…!
ప్రధానాంశాలు:
AP Volunteer : ఏపీ వాలంటీర్లకి బిగ్ బ్రేకింగ్ న్యూస్...!
AP Volunteer : ఏపీలో అన్ని విషయాల మీద ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తున్నట్టు అనిపిస్తుండగా వాలంటీర్ల విషయమపై మాత్రం ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవట్లేదు. దీని వెనక కారణాలు ఏంటన్నది తెలియదు కానీ ఏపీలో వాలంటీర్ల భవిత్వం ఏంటి అన్నది ఇప్పుడు ఎవరికీ అర్ధం కావట్లేదు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ మీద నిజంగా అయితే కూటమి ప్రభుత్వం అంత ఆసక్తిగా లేదు. వారి అవస్రం లేకుండానే ప్రజలకు ప్రభుత్వ పతకాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఐతే ఎలక్షన్స్ టైం లో ఏపీ వాలంటీర్లు రెండున్నర లక్షల దాకా ఉండగా లక్ష మంది రాజీనామా చేశారు. అది కొందరు వైసీపీ నేతలు బలవంతంగా చేయించారని అంటుంటారు. ఐతే ప్రస్తుతం ఉన్న లక్షన్నర గ్రామ వాలంటీర్లను కూడా ప్రభుత్వం ఖాళీగానే ఉంచుతుంది. నెల నెల పెన్షన్స్ కూడ సచివాలయ సిబ్బంది ఇస్తున్నారు. అసలైతే ఆ పెన్షన్స్ గ్రామ వాలంటీర్లు ఇవ్వాల్సి ఉంటుంది.
AP Volunteer వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమా..
కానీ వార్డుకి 10 మంది దాకా తీసుకున్న సచివాలయ సిబ్బంది ఉండగా వలంటీర్లతో పని ఏంటని పెన్షన్స్ వారితోనే అందిస్తున్నారు. అంతేకాదు వాలంటీర్లకు 2 నెలల నుంచి జీతం కూడా ఇవ్వట్లేదు. వారికి జీతం పెంచి వారిని ప్రభుత్వ కార్యక్రలాపాలకు ఉపయోగించే ఆలోచన ఉందని ఈమధ్య వార్తలు రాగా అది ప్రభుత్వం పై అదనపు భారం తెచ్చి పెడుతుందని తెలిసి వెనక్కి తగ్గారు. ఇక రాష్ట్ర సర్పంచ్ సంఘం వాలంటీర్ వ్యవస్థ రద్ధు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలో పంచాయితీ రాజ్ ఛాబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు.
అసలే కూటమి ప్రభుత్వం వాలంటీర్ల మీద ద్వంద వైఖరి వ్యవహరిస్తుంటే వాలంటీర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం లేట్ చేయకుండా త్వరగా వారి విషయంలో సరైన నిర్ణయం తీసుకుని వారికి సరైన విధి విధానాలు అప్పచెప్పే ప్రయత్నం చేస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.