Venu Swamy : వారిద్దరి కాంబినేషన్ అసలు వర్కౌట్ కాదు… ఈసారి కూడా ఓటమి తప్పదు… వేణు స్వామి…!
Venu Swamy : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి ముగిసినప్పటికీ ఈసారి ఎవరు అధికారం సాధిస్తారనే అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు విజయం తమదేనంటూ విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. మరోవైపు ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే రాజకీయాలపై అనేక రకాల చర్యలు జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారం […]
Venu Swamy : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి ముగిసినప్పటికీ ఈసారి ఎవరు అధికారం సాధిస్తారనే అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు విజయం తమదేనంటూ విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. మరోవైపు ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే రాజకీయాలపై అనేక రకాల చర్యలు జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఎవరిని వరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే పలు రకాల సంస్థలు అనేక రకాల సర్వేల ద్వారా విజయం ఎవరిని వరిస్తుంది అనే విషయాలను తెలియజేసినప్పటికీ అసలు ఫలితాలు వచ్చేంతవరకు అధికారం ఎవరిది అనేది ఎవరు అంచనా వేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Venu Swamy వారిద్దరి కలయిక తీవ్ర నష్టాన్ని తెస్తుంది…
ఈ క్రమంలోనే ఇటీవల వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలని బయట పెడుతూ సంచలనంగా మారిన వేణు స్వామి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సంచలన విషయాలను తెలియజేశారు.ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు స్వామి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు పొత్తు అనేది ఒక్కసారి మాత్రమే కలిసి వస్తుందని తెలియజేశారు. జాతకరీత్యా వారిద్దరి పొత్తు అనేది కేవలం ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందని ఆ తర్వాత అసలు పని చేయదని తెలియజేశారు. చంద్రబాబు గారిది పుష్యమి నక్షత్రం , పవన్ కళ్యాణ్ గారిది ఉత్తరాషాడ నక్షత్రం మకర రాశి.
అందుకే వీరిద్దరి కాంబినేషన్ వర్కౌట్ కాదని చెప్పుకొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి 2017 ఏలినాటి శని ప్రారంభమైందని అది 2025 జూలై వరకు ఉందని తెలిపారు. ఇక 2014లో ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అయింది కాబట్టి ఈసారి వీరిద్దరి కాంబినేషన్ వర్కౌట్ కాదని వేణు స్వామి తెలిపారు. అందుకే ప్రస్తుతం వీరిద్దరి కలయిక నష్టాన్ని చేకూరుస్తుంది తప్ప అనుకూలంగా జరిగే పరిస్థితులు కనిపించడం లేదంటూ వేణు స్వామి స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దుమారం లేపుతున్నాయి. ప్రత్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొన్న సమయంలో అధికారం ఎవరిని వరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.